బాలయ్య 2.0 - అన్‌స్టాపబుల్
'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు', 'రూలర్'.. ఇవి పాండమిక్ కి ముందు బాలకృష్ణ నుంచి వచ్చిన అల్ట్రా డిజాస్టర్ సినిమాలు.
By: Tupaki Desk | 17 Jan 2025 3:50 AM GMTనందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ప్రస్తుతం గోల్డెన్ శకం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు వరుస పరాజయాలతో సతమతమైన సీనియర్ హీరో.. గత నాలుగేళ్ళ నుండి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. టైర్-1 స్టార్ హీరోల రేంజ్ లో ఓపెనింగ్స్ రాబడుతున్నారు. ఒకప్పుడు బాలయ్య సినిమా వస్తుందంటే సోషల్ మీడియాకి కావాల్సినంత ట్రోలింగ్ స్టఫ్ దొరికినట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు బాలయ్య వస్తున్నాడంటే బాక్సాఫీస్ దగ్గర హిట్టు గ్యారంటీ అనుకునే విధంగా మారిపోయింది.
'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు', 'రూలర్'.. ఇవి పాండమిక్ కి ముందు బాలకృష్ణ నుంచి వచ్చిన అల్ట్రా డిజాస్టర్ సినిమాలు. ఇలాంటి ఘోర పరాజయాలను అందుకున్న తర్వాత నటసింహం పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. నందమూరి అభిమానులు సైతం ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఊహించలేదు. ఇక కెరీర్ ముగిసినట్టే అనుకున్న సమయంలో 2021 చివర్లో 'అఖండ' సినిమాతో తిరిగి పుంజుకున్నారు. అప్పటి నుంచీ 'బాలయ్య 2.0' ని తెర మీద ఆవిష్కరిస్తూ దూసుకుపోతున్నార
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని సాధించింది. కరోనా పాండమిక్ తర్వాత జనాలు థియేటర్లలోకి రావడానికి భయపడుతున్న తరుణంలో, 10 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టారు. ఇది అప్పటికి ఆయన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్. యూఎస్ లోనూ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో చేసిన 'వీర సింహా రెడ్డి' సినిమా సైతం ఘన విజయం అందించింది. సంక్రాంతి క్లాష్ లో వచ్చి 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ తో సంచలనం సృష్టించారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన 'భగవంత్ కేసరి' సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు బాలయ్య. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన కంటెంట్ తో వచ్చినా జనాలు విపరీతంగా ఆదరించారు. 6 రోజుల్లో వంద కోట్ల కలెక్షన్స్ అందించారు. ఇప్పుడు లేటెస్టుగా సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' మూవీ గాడ్ ఆఫ్ మాసెస్ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తోంది. బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్యలోని కొత్త మాస్ యాంగిల్ ని ఆవిష్కరించింది. ఫలితంగా 4 రోజుల్లోనే నూరు కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
ఇలా బాలకృష్ణ వరసగా నాలుగు 100 కోట్ల సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. సూపర్ సీనియర్లలో ఇటీవల కాలంలో స్థిరంగా హిట్లు కొడుతున్న ఏకైక హీరో బాలయ్య. 60 ఏళ్లకు పైబడిన వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న ఆయన.. 'అఖండ 2: తాండవం' మూవీ నుండి తన సెకండ్ ఇన్నింగ్స్ చూస్తారని చెబుతున్నారు. అయితే బాలయ్య సక్సెస్ లో 'అన్ స్టాపబుల్' టాక్ షో ముఖ్య భూమిక పోషించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 'ఆహా' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో.. ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. నేటితరం ఆడియన్స్ కు బాలయ్యను దగ్గర చేసింది. గతంలో ట్రోలింగ్ చేసిన వాళ్ళతోనే 'జై బాలయ్య' స్లోగన్స్ ఇచ్చేలా చేసింది. అందుకే బాలయ్య ఎంత బిజీగా ఉన్నా, ‘అన్-స్టాపబుల్’ షో కోసం సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు.