Begin typing your search above and press return to search.

అఖండ 2 కి బాలయ్య పారితోషికం...!

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సమయంలోనే సీక్వెల్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 5:33 AM GMT
అఖండ 2 కి బాలయ్య పారితోషికం...!
X

నందమూరి బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2025 సంక్రాంతికి బాలయ్య - బాబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాబీ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం బోయపాటి అఖండ సీక్వెల్‌ ను బాలకృష్ణ తో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సమయంలోనే సీక్వెల్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సీక్వెల్‌ కోసం బోయపాటి స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడు. అదే సమయంలో సినిమా లో బాలయ్య లుక్‌ కోసం 3డి డిజైన్ లు రెడీ చేయిస్తున్నాడు. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో అఖండ 2 సినిమా కోసం బాలయ్య కెరీర్‌ లోనే అత్యధిక పారితోషికంను అందుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో పాటు ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాకూ కాస్త అటు ఇటుగా రూ.20 కోట్ల పారితోషికం ను అందుకున్నాడు. ఈ మొత్తం ఇండస్ట్రీలో చాలా మంది యంగ్‌ హీరోల పారితోషికం కంటే తక్కువ. బాలయ్య అఖండ సినిమాతో పాటు భగవంత్‌ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు నమోదు చేసిన కారణంగా పారితోషికంను పెంచేశారు. బాలయ్య తన పారితోషికంను 20 కోట్ల నుంచి ఒకేసారి పది కోట్లు పెంచి అఖండ 2 కి గాను రూ.30 కోట్లలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్యుయెల్‌ రోల్ లో బాలకృష్ణ ఆ సినిమాలో కనిపించబోతున్నాడు అనే వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్నాయి.

అఖండ 2 కి బాలకృష్ణ రూ.30 కోట్ల ను పారితోషికంగా అందుకోబోతున్న నేపథ్యంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాలీవుడ్‌ టాప్‌ హీరోల జాబితాలో చోటు సంపాదించాడు. ఇంతకు ముందు వరకు నాని, రవితేజల తర్వాత స్థానంలో ఉన్న బాలకృష్ణ ఇప్పుడు వారిని క్రాస్ చేశాడని ఇండస్ట్రీ లో ప్రచారం జరుగుతోంది. అఖండ 2 సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుని వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తే రాబోయే రోజుల్లో బాలయ్య పారితోషికం రూ.50 కోట్లు చేరినా ఆశ్చర్యం లేదు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయినా బాలయ్య పారితోషికం విషయంలో యంగ్‌ హీరోలతో పోటీ పడటం విశేషం.