Begin typing your search above and press return to search.

వేణు ఎల్లమ్మ.. ఈసారి ఆ హీరో దగ్గరకు..

బలగం సినిమాతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 5:23 AM GMT
వేణు ఎల్లమ్మ.. ఈసారి ఆ హీరో దగ్గరకు..
X

బలగం సినిమాతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఎల్లమ్మ’ టైటిల్ తో ఒక కథని వేణు సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ అండ్ యాక్షన్ జోనర్ లో ఉండే కథతో ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో చేయడానికి రెడీగా ఉన్నారు.

అయితే వేణు ఈ సినిమాకి ఇంకా హీరోని కన్ఫర్మ్ చేసుకోలేదు. ముందుగా ఈ మూవీ కోసం నేచురల్ స్టార్ నానిని వేణు కన్ఫర్మ్ చేసుకున్నారు. అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. మరల ఏమైందో ఈ ప్రాజెక్ట్ నుంచి నాని తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో వేణు నితిన్ కి ఈ కథ చెప్పారంట. అతనితో ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనే ప్రచారం జరిగింది. మరల ఎందుకనో నితిన్ కూడా సెట్ కాలేదని కొత్త టాక్ మొదలైంది.

ఇటీవల ‘జనక అయితే గనక’ మూవీ ప్రమోషన్ ఈవెంట్ కి వేణు వచ్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు వేణుని ‘ఎల్లమ్మ’ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తావని అడిగారు. త్వరలో మొదలుపెడతానని వేణు చెప్పారు. హీరో ఇంకా కన్ఫర్మ్ కాకపోవడం వలన ఈ మూవీ ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ గురించి ఇంకో ప్రచారం తెరపైకి వచ్చింది. యంగ్ హీరో ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జాతో వేణు ఈ మూవీ ఒకే చేసుకునే ప్రయత్నంలో ఉన్నారంట.

రీసెంట్ గా తేజ సజ్జాకి వేణు కథ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తేజ కూడా ఇంకా అతనికి మూవీ చేస్తానని క్లారిటీ ఇవ్వలేదంట. ప్రస్తుతం తేజ సజ్జా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో కూడా తేజ సూపర్ యోధుడిగా కనిపించబోతున్నాడు. తేజ సజ్జా నెక్స్ట్ కూడా భారీ కాన్వాస్ ఉన్న కథల కోసం ట్రై చేస్తున్నాడు.

అలాగే పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టోరీస్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఎల్లమ్మ కథ నేపథ్యం పూర్తిగా తెలంగాణ నేటివిటీలో కల్ట్ మాస్ గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ తేజ ఈ మూవీ ఒప్పుకుంటే దిల్ రాజు భారీ బడ్జెట్ తో ‘ఎల్లమ్మ’ మూవీ నిర్మించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ మూవీ ఒప్పుకోవాలా వద్దా అనే ఫైనల్ డెసిషన్ తేజ సజ్జా చేతిలో ఉంది. అతను కాదంటే వేణు ఇంకెవరితో చేస్తాడో చూడాలి.