Begin typing your search above and press return to search.

మై ల‌వ్‌లీ బ్ర‌ద‌ర్.. బాల‌య్య‌పై ర‌జ‌నీ లవ్!

"యాక్షన్ కింగ్! కలెక్షన్ కింగ్! డైలాగ్ డెలివరీ కింగ్! నా లవ్‌లీ బ్రదర్ బాలయ్య" ఇదీ ర‌జ‌నీకాంత్ అభిమానం.

By:  Tupaki Desk   |   1 Sep 2024 7:35 AM GMT
మై ల‌వ్‌లీ బ్ర‌ద‌ర్.. బాల‌య్య‌పై ర‌జ‌నీ లవ్!
X

``యాక్షన్ కింగ్! కలెక్షన్ కింగ్! డైలాగ్ డెలివరీ కింగ్! నా లవ్‌లీ బ్రదర్ బాలయ్య`` ఇదీ ర‌జ‌నీకాంత్ అభిమానం. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతున్న బాల‌య్య‌ను ``మై ల‌వ్ లీ బ్ర‌ద‌ర్`` అంటూ ఆప్యాయంగా పిలిచారు. ర‌జ‌నీ విషెస్ ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్ లో హా* టాపిక్.

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. తన X ఖాతాలో హృద‌యాన్ని ట‌చ్ చేసే సందేశాన్ని ర‌జ‌నీ షేర్ చేసారు. బాలకృష్ణను తన సోదరుడుగా పేర్కొన్న రజనీకాంత్.. ఎన్బీకే హార్డ్ వ‌ర్క్, కృషి, విజ‌యాల‌ను ప్ర‌శంసించారు. బాలకృష్ణ ఐదు దశాబ్దాల కెరీర్‌ను పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ నోవాటెల్ లో గ్రాండ్‌గా వేడుకలు నిర్వహించనుండ‌గా ఇది ఉత్సాహాన్నిచ్చే అతి పెద్ద విష్‌. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ స‌హా ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఈ వేడుక‌కు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం.

ర‌జ‌నీ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో బాల‌య్య‌కు ఇలా విష్ చేసారు. ``యాక్షన్ కింగ్! కలెక్షన్ కింగ్! డైలాగ్ డెలివరీ కింగ్! నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతున్నారు. గొప్ప విజయం! ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. ఆత్మ‌కు ప్ర‌శాంత‌త‌, మంచి ఆరోగ్యం, సంతోషం ఉండాల‌ని కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వ‌దించాలి!`` అని విష్ చేసారు.

1974లో తాతమ్మ కల సినిమాతో మొదలైన బాలకృష్ణ అద్భుతమైన ఐదు ద‌శాబ్ధాల‌ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నందున ఈ రోజు అభిమానుల నుంచి సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. సినీపరిశ్ర‌మ ప్ర‌ముఖుల నుంచి అరుదైన విషెస్ బాల‌య్య‌కు అందుతున్నాయి.

రజనీకాంత్ - బాలకృష్ణ ప‌రిశ్ర‌మ‌లో స్నేహితులు. గ‌తంలో ఓసారి బాలకృష్ణ తండ్రి, దివంగ‌త‌ లెజెండ‌రీ న‌టుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కి నివాళులర్పించే కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. బాలకృష్ణపైనా ప్ర‌శంస‌లు కురిపించారు. బాల‌య్య బాబు ఎక్స్ ప్రెష‌న్స్, న‌ట‌ ప్రదర్శనలు బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కూడా మించిపోయాయని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ త‌న తండ్రి గారైన ఎన్టీఆర్ స్ఫూర్తిని తన పాత్రల్లో ఇముడ్చుకున్నార‌ని అన్నారు.

కెరీర్ మ్యాటర్ కి వ‌స్తే.. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయాన్ విడుదలకు సిద్ధమవుతోంది. రజనీకాంత్ 170వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ త‌దిత‌రులు న‌టించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే, బాబీ కొల్లి దర్శకత్వంలో ఎన్‌బికె 109 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.