Begin typing your search above and press return to search.

హీరోయిన్‌కి బాలకృష్ణ సూచన

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హీరోయిన్‌ శ్రద్దా శ్రీనాథ్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ మంచి నటి అని ప్రశంసలు కురిపించారు.

By:  Tupaki Desk   |   18 Jan 2025 6:21 AM GMT
హీరోయిన్‌కి బాలకృష్ణ సూచన
X

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్‌ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా లాంగ్‌ రన్‌లో అత్యధిక వసూళ్లు సాధించబోతుంది అనే నమ్మకంను నందమూరి ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్దా శ్రీనాథ్‌, ఊర్వశి రౌతేలా నటించారు. బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా ఊర్వశి రౌతేలా ఒక ఐటెం సాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలు, ఒక యాక్షన్‌ సన్నివేశంలోనూ కనిపించింది. ఇక శ్రద్దా శ్రీనాథ్ పాత్ర సినిమాలో కీలకంగా నిలిచింది. కలెక్టర్‌ పాత్రలో నటించిన శ్రద్దా వల్లే కథ కీలక ట్విస్ట్‌లను తీసుకుంటుంది.

డాకు మహారాజ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. సక్సెస్ మీట్‌లో హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హీరోయిన్‌ శ్రద్దా శ్రీనాథ్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ మంచి నటి అని ప్రశంసలు కురిపించారు. శ్రద్దా చేసిన పాత్రల గురించి బాబీ చెప్పాడు. అయితే శ్రద్దా రెగ్యులర్‌గా సినిమాల్లో కనిపించడం లేదు. నటి నటులు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఉండాలి. పాత్ర ఏదైనా సినిమాల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు.

శ్రద్దా ఎక్కువ సినిమాల్లో కనిపించక పోవడం వల్ల దక్కాల్సిన గుర్తింపు, స్టార్‌డం దక్కలేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. బాలకృష్ణ సైతం అదే మాట అన్నారు. శ్రద్దా ప్రతిభను బట్టి రెగ్యులర్‌గా సినిమా ఆఫర్లు దక్కంచుకుంటుంది. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఆమె మరిన్ని సినిమాలు చేయాలి. నటీనటులు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి. ఇక మీదట ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రద్దా వరుసగా సినిమాలు చేస్తుందని తాను భావిస్తున్నాను. ఇప్పటికే ఆమె తన పద్ధతి మార్చుకుందని నేను అనుకుంటున్నాను అన్నారు. బాలకృష్ణ సూచనకు శ్రద్దా తల ఊపుతూ ఇక మీదట రెగ్యులర్‌గా సినిమాలు చేస్తానన్నారు.

డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ద శ్రీనాథ్‌కి మంచి పాత్ర దక్కింది. కనిపించేది కొద్ది సమయం అయినా సినిమాలో చాలా కీలకమైన పాత్ర కావడంతో శ్రద్దా ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. అంతకు ముందు విశ్వక్‌ సేన్‌ సినిమా మెకానిక్ రాకీ సినిమాలో శ్రద్దా నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. ఛాన్స్ లభించాలే కానీ నటనతో కుమ్మేస్తాను అంటూ చాలా సార్లు శ్రద్దా శ్రీనాథ్ నిరూపించింది. అందుకే ఈ సినిమాతో మరోసారి శ్రద్దా కి మంచి పేరు వచ్చింది. బాలకృష్ణ సూచించినట్లుగా రెగ్యులర్‌గా శ్రద్దా శ్రీనాథ్ పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.