స్పేస్ సూట్‌లో బాలయ్య.. ఆదిత్య 369 సీక్వెల్ పై గూస్‌బంప్స్ అప్డేట్!
నందమూరి బాలకృష్ణ ఈమధ్య కాలంలో నాన్ స్టాప్ సర్ ప్రైజ్ లతో ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తున్నారు.
By: Tupaki Desk | 4 Dec 2024 11:13 AMనందమూరి బాలకృష్ణ ఈమధ్య కాలంలో నాన్ స్టాప్ సర్ ప్రైజ్ లతో ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తున్నారు. వరుస బాక్సాఫీస్ విజయాలు, అన్ స్థాపబుల్ సర్ ప్రైజ్ తో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక అభిమానులకు ఇప్పుడు మరో సూపర్ గుడ్ న్యూస్ చెప్పేశారు. 1991లో విడుదలై సంచలన విజయం సాధించిన 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ తెరకెక్కుతున్నట్టు బాలయ్య అధికారికంగా ప్రకటించారు.
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4’ షోలో బాలకృష్ణ ఈ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ డిసెంబర్ 6న ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ 'ఆదిత్య 369' గెటప్‌లో దర్శనమిచ్చారు. స్పేస్ సూట్ ధరిస్తూ బాలయ్య కనిపించిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంప్లీట్ గా ఆయన వృద్ధుడిగా దర్శనమిచ్చిన విధానం హైలెట్ అయ్యింది. అభిమానులు ఈ లుక్‌ను మరింత వైరల్ చేస్తున్నారు.
‘ఆదిత్య 369’లో టైమ్ ట్రావెల్ గా ఆధ్యంతం అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా స్టోరీ లైన్ నేపథ్యంలో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రూపొందనుంది. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం కాబోతున్నారు. బాలయ్య ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం విశేషం. "మా అబ్బాయి మోక్షజ్ఞతో కలిసి ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఇది అభిమానులకు పెద్ద ట్రీట్ అవుతుంది," అని బాలకృష్ణ తెలిపారు.
'ఆదిత్య 369' అనేది టైమ్ ట్రావెల్ జోనర్‌లో తెలుగులో వచ్చిన మొదటి చిత్రాల్లో ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య పలు డిఫరెంట్ గెటప్స్ లో ఆకట్టుకున్నారు. అప్పట్లోనే కోటికి పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు సీక్వెల్ రూపంలో మరింత గ్రాండ్ గా తెరకెక్కనుంది. దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో తానే ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తాను అని బాలయ్య అన్నారు. కానీ మళ్ళీ వెనక్కి తగ్గినట్లు కూడా టాక్ వచ్చింది.
ప్రశాంత్ వర్మ పేరు కూడా వినిపించింది. కానీ ప్రస్తుతం ఆ దర్శకుడితో మోక్షజ్ఞ మరో కథతో రాబోతున్నారు. మరి దర్శకుడు ఎవరనే విషయంలో త్వరలోనే క్లారిటీ రావచ్చు. ఇక బాలకృష్ణ ఈ సీక్వెల్ గురించి మాట్లాడిన సందర్భంగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేశారు. అన్ స్టాపబుల్ కొత్త ఎపిసోడ్‌లో బాలకృష్ణ ప్రత్యేక గెటప్‌లో కనిపించడం గమనార్హం. ఆయన చెప్పిన విషయాలు, సీక్వెల్‌కి సంబంధించిన వివరాలు అభిమానులను మరింత ఉత్సాహపరిచాయి. అంతేకాదు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఆ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది.