Begin typing your search above and press return to search.

'అఖండ 2' కోసం 3D స్కెచ్‌ వర్క్‌!

బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత బాలయ్య తదుపరి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 5:41 AM GMT
అఖండ 2 కోసం 3D స్కెచ్‌ వర్క్‌!
X

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో షూటింగ్‌ ను ముగించే అవకాశాలు ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత బాలయ్య తదుపరి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా కు పాన్‌ ఇండియా స్థాయిలో మంచి స్పందన దక్కింది. బాలయ్య కెరీర్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సైతం అఖండ నిలిచిన విషయం తెల్సిందే. అందుకే బాలయ్య, బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖండ 2 లోనూ బాలయ్య ను డ్యుయెల్‌ రోల్‌ లో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

గత కొన్ని నెలలుగా బోయపాటి అఖండ 2 సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ సైతం షురూ చేశాడు. అఖండ 2 లో బాలయ్య ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నాడు. ఆ పాత్రలు ఎలా ఉండాలి అనే విషయమై స్కెచ్ లు వేయిస్తున్నాడు. అయితే 3డి లో స్కెచ్ లు వేయిస్తున్న నేపథ్యంలో మరింత నేచురాలిటీగా మరింత బాగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో బోయపాటి టెక్నాలజీని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అఖండ 2 సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ లో వచ్చిన మూడు సినిమాలతో పోల్చితే అఖండ 2 అంతకు మించి అన్నట్లుగా ఉంటుందట. అఖండ సినిమా కథ కు కొనసాగింపుగా అఖండ 2 ఉంటుందా అనే విషయమై క్లారిటీ లేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అనుసారం అఖండ 2 లోనూ ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించబోతుందట. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సైతం అఖండ 2 లో నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా అయిన జోష్ మీద ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే సినిమాలను జోష్ తో చేస్తున్నాడు. కనుక అఖండ 2 సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి.