అఖండ2లో బాలయ్య నెగిటివ్ రోల్?
ఇక డాకు మహారాజ్ తర్వాతి సినిమా కోసం బాలయ్య బోయపాటి శ్రీనుతో మరోసారి చేతులు కలిపాడు.
By: Tupaki Desk | 10 Feb 2025 4:30 PM GMTనటసింహ నందమూరి బాలకృష్ణ ఈ మధ్య వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ మీదున్నాడు. దానికి తోడు రీసెంట్ గా కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అనౌన్స్ చేసింది. దీంతో ఆయన, ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రీసెంట్ గా సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.
ఇక డాకు మహారాజ్ తర్వాతి సినిమా కోసం బాలయ్య బోయపాటి శ్రీనుతో మరోసారి చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తాండవం పేరిట ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే అఖండ2 తాండవం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ పైకి కూడా వెళ్లింది.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న అఖండ2 తాండవంపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టంట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అఖండ2లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రెండు పాత్రల్లో ఓ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు.
అఖండ2 ఇంటర్వెల్ లో బాలయ్య సెకండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికి ఇదే హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. బాలయ్య నెగిటివ్ రోల్ పై వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం అఖండ2లో బాలయ్య నట విశ్వరూపాన్ని చూడొచ్చు. అయితే ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనుండగా, ఆది చేస్తున్నది విలన్ పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అఖండ2 కోసం ఒక్కో భాష నుంచి ఒక్కొక్కరిని తీసుకుని సినిమాపై బజ్ ను పెంచాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాను నందమూరి తేజస్విని సమర్పిస్తుండగా, 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. అఖండకు సంగీతం అందించిన తమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు.