బాలయ్య-ఆది మధ్య వార్ సినిమాకే హైలైట్!
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `అంఖడ-2` పాన్ ఇండియాలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 10 Feb 2025 3:40 AM GMTగాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `అంఖడ-2` పాన్ ఇండియాలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ పట్టాలెక్కిన ఏడాదే? కుంభమేళా కూడా రావడంతో? కుంభమేళా రియల్ లోకేషన్లనో బాలయ్యపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం కూడా లభించింది. ఆ రకంగా టీమ్ ఎంతో లక్కీ. సినిమాకి ఇదొక పెద్ద పాజటివ్ సైన్. సినిమాలో ఈ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా హైలైట్ అవ్వబోతున్నాయి.
సాధారణంగా కుంభమేళాలో కోట్ల జనాభాని చూస్తే థ్రిల్ ఫీలవుతాం. అలాంటింది వెండి తెరపై ఆ సన్నివేశాలు ఇంకెత అద్భుతంగ ఉంటాయి? అన్నది ఊహకి కూడా అందని విధంగా బోయపాటి వాటిని తీర్చిదిద్దుతారు. ఈ సినిమాలో ఆది పీనిశెట్టి ఓ పవర్ పుల్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో బాలయ్య-ఆదిపై కీలక యాక్షన్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ కి రామ్ -లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు.
ఇద్దరి మద్య జరిగే ఈ ఫైట్ పీక్స్లో ఉంటుందిట. ఆరంభంలో బాలయ్య-ఆది నువ్వా? నేనా? అన్న రేంజ్ లో తల పడుతున్నారుట. ఫైట్ క్లైమాక్స్లో మాత్రం బాలయ్యతో వార్ అంటే వన్ సైడ్ అయిపోతుంది. ప్రత్యర్ధి చావు దెబ్బలు తిని పడిపోతాడు? కానీ ఈ ఫైట్లో మాత్రం ఆది ఎన్ని దెబ్బలు తిన్నా? లేచి మరీ బాలయ్య పై తిరగబడి దాడి చేసే సన్నివేశాలు ఎంతో బలంగా ఉంటాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఈ యాక్షన్ సన్నివేశం విషయంలో బోయపాటి క్రియేటివిటీ కూడా తోడవుతుందిట.
ఆయన కూడా రామ్ -లక్ష్మణ్ కు కొన్ని యాక్షన్ సీన్స్ రిఫరెన్స్ సెస్ గా పంపిచాడుట. సాధారణంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో బోయపాటి భాగస్వామ్యం అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. తెరపై బలమైన యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయంటే? అక్కడ బోయపాటి విజన్ ఉంటుంది. అందుకే బాలయ్యకు సెకెండ్ ఇన్నింగ్స్ లోప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. `అఖండ`లో బాలయ్యపై ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయో తెలిసిందే. ఇప్పుడు అఖండ-2 లో ఆ యాక్షన్ పీక్స్ లో ఉంటుంది.