అఖండ 2... ఆ పనులు షురూ!
బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్స్ తర్వాత నటిస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి.
By: Tupaki Desk | 27 Feb 2025 5:45 AM GMTబాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్స్ తర్వాత నటిస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ సక్సెస్ జెర్నీ అఖండతో మొదలై వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం అఖండ 2 తో ఐదవ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం కోసం బాలకృష్ణ రెడీ అవుతున్నాడు. ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నా, ఇతర పనులతో బిజీగా ఉన్నా అఖండ 2 సినిమా షూటింగ్ విషయంలో మాత్రం బాలకృష్ణ తగ్గడం లేదు. ఇప్పటికే దాదాపుగా సగం షూట్ పూర్తి చేశారనే వార్తలు వస్తున్నాయి.
అఖండ 2 సినిమా కోసం ఇటీవల ప్రయాగ్ రాజ్ వెళ్లి కుంభమేళా సన్నివేశాలను చిత్రీకరించుకుని వచ్చారు. మహా కుంభమేళ సన్నివేశాలు, విజువల్స్ అఖండ 2 సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకం, విశ్వాసంను బోయపాటి టీం మెంబర్స్ వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 సినిమా విజువల్ వండర్‌గా రూపొందించేందుకు గాను దర్శకుడు బోయపాటి తన గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో ఎక్కువ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను వినియోగిస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సన్నివేశాల కోసం పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆర్టిస్ట్‌లు వర్క్ చేస్తున్నారు.
ఇటీవలే ఆ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ టీం ఆ సన్నివేశాలపై చిత్రీకరణ చేస్తున్నారు. షూట్ పూర్తి కాకముందే వీఎఫ్‌ఎక్స్ పనులు మొదలు పెట్టినట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో అప్పుడే ఆ పనులను మొదలు పెట్టామని అఖండ 2 మేకర్స్ చెబుతూ ఉన్నారు. అఖండ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్పడంతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు అఖండ 2 లో సనాతన ధర్మంను గురించి చెప్పబోతున్నారని సమాచారం అందుతోంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు అయ్యాయి. అఖండ 2 తో డబుల్ హ్యాట్రిక్ నమోదు కాబోతున్నట్లు అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ఇదే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ 2 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ సాధించిన సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించారు, వరుసగా ఐదవ సారి బాలయ్య మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.