బాలయ్యకి-బన్నీకి రొమాన్సే ఇష్టమా!
అయితే ఈ నయా హీరోలిద్దరికీ యాక్షన్ సినిమాలకంటే రొమాన్స్ సినిమాలే ఎక్కువగా చేయాలనిపిస్తుందన్న విషయం బయటకు వచ్చింది.
By: Tupaki Desk | 23 Jan 2025 11:30 AM GMTనటసింహ బాలకృష్ణ- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటి వరకూ ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో మాస్ యాంగిల్ కామన్ గా హైలైట్ అవుతుంది. ఆయన ఏ సినిమా చేసినా ఆయన మాస్ ఇమేజ్ ని డైరెక్టర్లు ఎన్ క్యాష్ చేసుకుంటారు. అలాగే బన్నీలో స్టైలిష్ యాంగిల్ ని దర్శకులు తీసుకుంటారు. వాళ్ల ఇమేజ్ ఆధారంగా కథలు..పాత్రల్ని సిద్దం చేసుకుని సినిమాలు చేస్తుంటారు.
అయితే ఈ నయా హీరోలిద్దరికీ యాక్షన్ సినిమాలకంటే రొమాన్స్ సినిమాలే ఎక్కువగా చేయాలనిపిస్తుందన్న విషయం బయటకు వచ్చింది. ఓ టాక్ షోలో యాక్షన్ అంటే ఇష్టమా? రొమాన్స్ అంటే ఇష్టమా? అంటే బన్నీ కాస్త ఆలోచించి..బాలకృష్ణతో ఎవరికి చెప్పరు కదా? అంటూ రొమాన్స్ అంటే ఇష్టమంటాడు. వెంటనే బాలయ్య పగలబడి నవ్వుతారు. బాలయ్య కూడా నా క్కూడా రొమాన్స్ సినిమాలంటే ఇష్టం...తొక్కోలో యాక్షన్ ఎవడికి కావాలంటారు.
ఆ రకంగా ఇద్దరిలో రొమాంటిక్ యాంగిల్ బయట పడింది. అయితే ఇద్దరిదీ ఇప్పుడు రొమాంటిక్ సినిమాలు చేసే వయసు కాదు. బాలయ్య కి ఇప్పటికే 60 ఏళ్లు దాటిపోయింది. బన్నీ కి 40 ఏళ్లు దాటింది. రొమాంటిక్ సినిమాలు చేస్తామంటే దెబ్బలు పడతాయ్ రాజా? అంటూ అసలొళ్లు ఇద్దరు దూసుకొస్తారు. హీరోలిద్దరు కుటుంబానికి ఎంతో సమయాన్ని కేటాయిస్తారు. షూటింగ్ ఉంటే సెట్స్ లో లేదంటో ఇంట్లోనే ఉంటారు.
పండగలు పబ్బాలు కుటుంబ సభ్యులతోనే జరుపుకుంటారు. ఆ వీడియోలు అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ తాండవం` తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే. బన్నీ మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.