Begin typing your search above and press return to search.

సూపర్ హీరోగా బాలయ్య.. పూనకాలు లోడింగ్ అంటున్న అభిమానులు..

నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ యాక్టర్ బాలయ్య.

By:  Tupaki Desk   |   10 Oct 2024 7:30 AM GMT
సూపర్ హీరోగా బాలయ్య.. పూనకాలు లోడింగ్ అంటున్న అభిమానులు..
X

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు టాలీవుడ్ లో ఓ బ్రాండ్ తో సమానం…సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే బాలయ్య పాట మోగందే ఫంక్షన్ పూర్తయిన ఫీల్ రాదు. జై బాలయ్య అనేది చాలామందికి ఓ ఎమోషన్ అంటే ఆశ్చర్యం కూడా లేదు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ యాక్టర్ బాలయ్య. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా బాక్సాఫీస్ ను బంతాట ఆడేశాడు బాలయ్య.. కాలంతోపాటు పాత్రాలను మారుస్తూ.. వైవిద్యమైన స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నాడు.


ఆరు పదుల వయసు దాటిన ఈ హీరోకి యువతలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా మాత్రమే కాకుండా ఓ సంఘ సేవకుడిగా.. రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు. ఇప్పటివరకు బాలయ్య సినిమాలకు కేవలం సినిమా థియేటర్లు మాత్రమే దడ దడలాడేవి అని అందరూ భావించేవారు..అయితే ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో.. అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో తనలోని మరో కోణాన్ని చూపించి ఆన్లైన్ ని కూడా ఓ ఆట ఆడుతున్నాడు బాలకృష్ణ.

ఈ టాక్ షోలో తనదైన చలోక్తులతో వచ్చిన అతిధులను తికమక పెడుతూ.. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. రికార్డులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బాలయ్య ఖాతాలో సరికొత్త రికార్డు చేరిందని టాక్ ఇక దేనికి సంబంధించి అక్టోబర్ 11న అధికారికంగా ప్రకటన కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ లో ఇంతవరకు బాలకృష్ణ కనిపించని ఓ వినూత్నమైన పాత్రలో కనిపించబోతున్నారు అనేది ఈ వార్త.

అంతేకాదు ఈసారి బాలకృష్ణ ఏకంగా సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నారు అని ఓ రేంజ్ లో పబ్లిసిటీ జరుగుతుంది. ఈ వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో.. బాలయ్య అభిమానులు క్యూరియాసిటీతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. గతంలో ఎన్టీఆర్ ఓ సినిమాలో సూపర్‌మేన్ పాత్రను పోషించి మెప్పించారు.. దీంతో బాలకృష్ణ తిరిగి తండ్రి పోషించిన పాత్రనే పోషిస్తారా అన్న టాక్ కూడా నడుస్తోంది.ఇక రేపటికి బాలయ్య పోషించబోయే ఆ సూపర్ హీరో పాత్ర పై కచ్చితంగా ఓ క్లారిటీ వస్తుంది.