రణ్‌బీర్ కపూర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్ అంటే ఇలా ఉండాలి!
ఇండియన్ సినిమాల్లో మల్టీస్టారర్ మూవీస్ కొత్త కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు.
By: Tupaki Desk | 1 April 2025 10:42 AMఇండియన్ సినిమాల్లో మల్టీస్టారర్ మూవీస్ కొత్త కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏ ఎన్నార్, కృష్ణ, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, శోభన్ బాబు, కృష్ణంరాజు. ఇలా మన హీరోలు అప్పట్లో మల్టీస్టారర్ మూవీస్ చేశారు. అయితే ఆ తరువాత స్టార్‌డమ్ పెరగడంతో సోలోగా సినిమాలు చేశారు. ఇక ఈ తరం హీరోల్లో మల్టీస్టార్ మూవీస్ చేసిన వాళ్లు చాలా తక్కువే.
కథ డిమాండ్ చేసినా ఇమేజ్ కారణంగా మన వాళ్లు మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొంత మంది ఇప్పటికీ ఈ తరహా సినిమాలంటే అడుగు దూరం వేస్తూ వద్దు బాబోయ్ అంటున్నారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి చేసిన RRRతో మళ్లీ మల్టీస్టార్ సినిమాలపై అందరిలోనూ చర్చమొదలైంది. అయితే ఇందులో ఇద్దరు హీరోలకూ సమాన ప్రాధాన్యత ఇస్తేనే నటించాలని, లేదంటే ఆ ప్రాజెక్ట్‌లని పక్కన పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హీరోలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఇదిలా ఉంటే కొంత మంది స్టార్స్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా మల్టీస్టారర్ సినిమాల కోసం సై అంటున్నారు. ఒక భాషలో స్టార్ హీరో కోసం మరో భాషకు చెందిన స్టార్‌లు నటించడానికి ముందుకొస్తున్నారు. దీనికి `సలార్` సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ కోసం మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ముందుకు రావడం తెలిసిందే. ఇప్పుడు ఇదే హీరో మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే సోషల్‌మీడియాలో ప్రస్తుతం ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదే రణ్‌బీర్ కపూర్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ గురించి. వీరిద్దరి కలయికలో భారీ మల్టీస్టార్ తెరపైకొస్తే చూడాలని అభిమానుల్లో చర్చ జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టార్ వస్తే భలే ఉంటుందని, ఇది ఇండియన్ సినిమాల్లోనే గ్రేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ అవుతుందని అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలనే ఐడియాని ముందు బయటపెట్టింది నందమూరి బాలకృష్ణ.
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4కు బన్నీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బన్నీని బాలయ్య పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. అంతే కాకుండా రణ్‌బీర్ కపూర్ ఫొటో చూపించి తన అభిప్రాయం చెప్పమన్నారు. దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ మా జనరేషన్‌లో వన్ ఆఫ్ ద ఫైన్ యాక్టర్ అని చెప్పడంతో బాలయ్య మరో ప్రశ్న సంబధిస్తూ మీరిద్దరూ కలిసి భారీ మల్టీస్టారర్ చేయోచ్చుకదా అని అడిగారు.
అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరూ కథని సిద్ధం చేయకపోతే తానే స్టోరీ అందిస్తానని, డైరెక్షన్ చేసే ధైర్యం ఎవరికీ లేకపోతే అది కూడా తానే చేస్తానని, ఇందు కోసం ఆరు నెలలు సమయం ఇస్తున్నానన్నారు. బాలయ్య ఈ మాటలు అన్న దగ్గరి నుంచి రణ్‌బీర్ కపూర్- బన్నీల మల్టీస్టార్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికి ఇది మొదలై ఐదు నెలలు కావస్తోంది. మరి దీనిపై బాలకృష్ణ మళ్లీ స్పందిస్తారో లేక బన్నీ స్పందిస్తారో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.