Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రెడీ!

టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Oct 2024 8:16 AM GMT
అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రెడీ!
X

టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోతో ఇంకా బిజీగా మారనున్నారు. ప్రముఖ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ షో.. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అందులో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ మరికొద్ది గంటల్లో అందుబాటులోకి రానుంది.

నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్ గా విచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్వాహకులు ఆ విషయాన్ని తెలిపారు. పిక్స్ అండ్ ప్రోమోను కూడా రిలీజ్ చేయగా.. వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రోమోలో బాబు మాట్లాడింది కొంతవరకే చూపించారు. గతంలో ఓ సీజన్ కు వచ్చిన చంద్రబాబు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు అంతకు మించి మ్యాటర్స్ ను పంచుకున్నట్లు తెలుస్తోంది.

50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు 'ఇది బాలయ్య పండుగ' అంటూ ఆహా పెట్టిన టైటిల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఎపిసోడ్ లో ఇప్పటికే తాను చేసిన సినిమాల్లోని తనకు ఇష్టమైన పాత్రలను బాలయ్య గుర్తు చేసుకోనున్నారని తెలుస్తోంది. ఆ మేనరిజమ్స్ ను కూడా ప్రదర్శించి అలరించనున్నారని సమాచారం. రాజకీయాల నుంచి బయటకు వచ్చి.. బాలయ్య, చంద్రబాబు కలిసి సరదాగా మాట్లాడుకున్న తీరు.. అందరినీ మెప్పించడం గ్యారెంటీ.

దానికి తోడు బాలయ్య.. చంద్రబాబు కోసం ఫన్నీ గేమ్స్ పెట్టినట్లు ప్రోమో ద్వారా అర్థమైంది. దీంతో ఫుల్ ఎపిసోడ్ లో ఓ రేంజ్ లో నవ్వులు పూయడం పక్కా. కేవలం రూ.500 బడ్జెట్‌ తో చమత్కారమైన కిరాణా షాపింగ్ సహా వివిధ గేమ్స్ ఆడనున్నారు చంద్రబాబు. తన తరహాలో తొడ కొట్టాలని లేదంటే జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం చేసి చూపించమని బాలయ్య అడిగారట. దీంతో చంద్రబాబు ఏం చేశారో చూడాలని నెటిజన్లు చెబుతున్నారు.

బాలకృష్ణ సంధించిన అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాలకు కచ్చితంగా అభిమానులు ఆనందిస్తారు. తన అభిమాన క్రికెటర్ గురించి చర్చించడం నుంచి గత సంవత్సరం రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల వరకు అనేక ప్రశ్నలు బాలయ్య అడిగారు. మొత్తానికి ఈరోజు రాత్రి 8:30 గంటలకు తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అందుకోసం అభిమానులు, నెటిజన్లు సహా అనేక మంది ఎంతో వెయిట్ చేస్తున్నారు.