ఆ విషయంలో గట్టి పట్టుదలతో బాలకృష్ణ..!
లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఏప్రిల్ 4న రీ రిలీజ్ కాబోతుంది.
By: Tupaki Desk | 31 March 2025 8:30 AMనందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య 'అఖండ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ కి సీక్వెల్‌గా రాబోతున్న సినిమా కావడంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను ప్రస్తుతం ఏ మాత్రం విశ్రాంతి లేకుండా సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. అత్యధిక బడ్జెట్‌తో రేర్ లొకేషన్స్‌లో అఖండ 2 సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం అఖండ 2 కంటే బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సినిమా గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.
లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఏప్రిల్ 4న రీ రిలీజ్ కాబోతుంది. ఈమధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అనేది చాలా కామన్ విషయం. అయితే రీ రిలీజ్ సినిమాకు భారీ ఎత్తున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ తరహాలో సినీ ప్రముఖులను సైతం ఆహ్వానించడం అనేది ఈ సినిమాకే చెల్లింది. బాలకృష్ణ ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మీడియా సమావేశంలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. రీ రిలీజ్ తో కచ్చితంగా ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా బాలకృష్ణ ధీమా వ్యక్తం చేయడంతో పాటు ఫ్యూచర్ మూవీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా 'ఆదిత్య 369' సీక్వెల్ విషయమై బాలకృష్ణ గత రెండు మూడు సంవత్సరాలుగా సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. స్క్రిప్ట్ ను స్వయంగా రెడీ చేయడంతో పాటు, ప్రముఖ రచయితలతో కలిసి ప్రస్తుతం ఫైనల్ వర్షన్‌ను రెడీ చేస్తున్నారని సమాచారం అందుతోంది. తాజాగా ఆదిత్య 369 సినిమా రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ కచ్చితంగా సీక్వెల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలకృష్ణ ఉన్న జోష్ నేపథ్యంలో సీక్వెల్‌ను చేయడం పెద్ద కష్టం కాదు, దాన్ని మార్కెట్ చేయడం అంత కంటే పెద్ద కష్టం కాదు. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయితే సీక్వెల్‌ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు బాలకృష్ణ ఎన్నో జోనర్‌లలో సినిమాలను చేశాడు. అందులో ఆదిత్య 369 సినిమా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. అద్భుతమైన కథ, కథనంతో దర్శకుడు అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవాలి అంటే కచ్చితంగా సీక్వెల్ కథ ను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లోనే నడిపించాల్సి ఉంటుంది. అంతే కాకుండా విభిన్నమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టి పడేయాలి. సింగీతం శ్రీనివాస్ పర్యవేక్షణలో సీక్వెల్ రూపొందితే కచ్చితంగా మంచి ఫలితం దక్కుతుందని బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. సీక్వెల్ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న బాలకృష్ణ దర్శకత్వ బాధ్యతలను తానే చూసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.
ఆ మధ్య ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ రూపొందితే మోక్షజ్ఞ కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పెద్దగా ఆ విషయమై చర్చ జరగలేదు. ఇప్పటి వరకు మోక్షజ్ఞ మొదటి సినిమా విషయమై క్లారిటీ రాలేదు. ఆదిత్య 369 సీక్వెల్‌తో ఒక వేళ మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బెస్ట్ ఛాయిస్ అవుతుందని కొందరు అంటున్నారు. మరి బాలకృష్ణ ఆలోచన ఏంటి అనేది చూడాలి.