Begin typing your search above and press return to search.

డాకు మహరాజ్.. ఊచకోత గట్టిగానే..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి రేసులో జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Jan 2025 7:33 AM GMT
డాకు మహరాజ్.. ఊచకోత గట్టిగానే..
X

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి రేసులో జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెరెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ యాక్టివ్ గా చేస్తున్నారు. జనవరి 4న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజగా ఈ సినిమా నుంచి బాలయ్య, ఊర్వశీ రౌతేలా మీద చిత్రీకరించిన పాటని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం సాంగ్ ట్రెండింగ్ కొనసాగుతోంది. బాలయ్య ఈ వయస్సులో కూడా చాలా జోష్ తో డాన్స్ స్టెప్పులు వేసాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండటంతో ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

థియేటర్స్ ని తగలెట్టేసే స్థాయి భారీ విద్వంసానికి ఇంకా 9 రోజులు మాత్రమే ఉందని మేకర్స్ ‘డాకు మహారాజ్’ పోస్టర్ ని షేర్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య ‘డాకు మహారాజ్’ గెటప్ లో చేతితో కత్తి పట్టుకొని ఊచకోత కోసే వీరుడిగా కనిపిస్తున్నాడు. వరుస హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలయ్య ఈ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు అనుకుంటున్నారు.

నిర్మాత నాగవంశీ కూడా ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కచ్చితంగా ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అన్నారు. ఈ మధ్యకాలంలో సితార నుంచి వచ్చిన సినిమాలలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. చివరిగా ‘లక్కీ భాస్కర్’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని 100 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. ఆ సినిమా విషయంలో నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు.

‘డాకు మహారాజ్’ అవుట్ ఫుట్ విషయంలో కూడా నిర్మాత అంతే నమ్మకంగా ఉన్నాడు. ‘డాకు మహారాజ్’ ఎర బిగిన్స్ అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతోన్న మూడు సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో ఉండబోతోంది. మరి ఆడియన్స్ ఏ సినిమాపై ఆసక్తి చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ మూవీ సూపర్ హిట్ అయితే బాలయ్య మార్కెట్ వేల్యూ అమాంతం పెరిగిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ బాలయ్య నుంచి ‘అఖండ 2’ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ అనుకుంటున్నారు.