డాకు మహారాజ్.. బాలయ్య ఫాన్స్ అన్ హ్యాపీ?
నైజాం ఏరియాలో ఆసియన్ సురేశ్ బాబు ఆధిపత్యం బలంగా ఉండడంతో, వెంకటేష్ భాగస్వామిగా ఉండటానికి అనుకూలంగా మరిన్ని స్క్రీన్లు దక్కాయని టాక్ వస్తోంది.
By: Tupaki Desk | 18 Jan 2025 8:30 AM GMTసంక్రాంతి పండగ సీజన్‌లో విడుదలైన నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకు మాస్ ఆడియెన్స్ ను మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైనర్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. వరుస హిట్స్ తో హై వోల్టేజ్ ఫామ్ లో ఉన్న బాలయ్యకు ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా అనే చెప్పాలి. మరోసారి బిగ్ హిట్ అందుకుంటే నెక్స్ట్ రాబోయే అఖండ2 సినిమాకు అంతకుమించిన బూస్ట్ లభిస్తుంది.
అయితే డాకు మహరాజ్ రిలీజ్ ప్లానింగ్ విషయంలో బాలయ్య ఫాన్స్ అంతగా హ్యాపీగా లేరని టాక్ వస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో కాబట్టి ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా గతంలో కంటే ఎక్కువ స్థాయిలో థియేటర్స్ లభిస్తాయని అనుకున్నారు. కానీ నైజాం ఏరియాలో సరిగా విడుదల చేయలేదని బాలయ్య ఫాన్స్ అసంతృప్తిగా ఉన్నారట. నైజాం ఏరియాలో ఈ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో, థియేటర్ కేటాయింపులు ఎంతో ప్రాధాన్యం పొందాయి. కానీ, డాకు మహారాజ్‌కు నైజాంలో కేవలం 180 స్క్రీన్లు మాత్రమే దక్కాయి. అదే సమయంలో మరో పెద్ద సినిమాకు 250కి పైగా స్క్రీన్లు కేటాయించడంపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం కూడా మళ్లీ థియేటర్ల కౌంట్ ను పెంచుకుంటోంది.
నైజాం ఏరియాలో ఆసియన్ సురేశ్ బాబు ఆధిపత్యం బలంగా ఉండడంతో, వెంకటేష్ భాగస్వామిగా ఉండటానికి అనుకూలంగా మరిన్ని స్క్రీన్లు దక్కాయని టాక్ వస్తోంది. మరోవైపు, డాకు మహారాజ్ నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న దిల్ రాజు, తన చిత్రమైన గేమ్ ఛేంజర్ ప్రాధాన్యతను ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇది బాలయ్య అభిమానులను కలవరపెట్టింది. బాలకృష్ణ గత చిత్రం భగవంత్ కేసరి నైజాంలో 15 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అది దసరా సీజన్ లో వచ్చింది. కానీ, డాకు మహారాజ్ విడుదలైన పొంగల్ టైమ్ చాలా స్పెషల్.
అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం 10 కోట్లే వసూలు చేసింది. ఈసారి ఓపెనింగ్స్ లోనే గత సినిమా కంటే 30% కలెక్షన్లు పెరగాలి. ఓపెనింగ్స్ లోనే ఇది 15 కోట్ల వరకు చేరే అవకాశాలు న్నప్పటికీ, మరింత థియేటర్ కేటాయింపులు ఉంటే మరో 2 కోట్లు అదనంగా వసూలయ్యేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, చిత్రబృందం నుండి సరైన ప్రణాళిక లేకపోవడం నైజాంలో సరైన థియేటర్ కేటాయింపులు లభించకపోవడం కారణంగా వసూళ్లపై ప్రభావం పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
నెక్స్ట్ టైమ్ బాలయ్య సినిమాలపై ఇది కచ్చితమైన ప్రభావం చూపవచ్చు. నైజాంలో బాలయ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడంలో మేకర్స్ కాస్త ఫెయిల్ అయ్యారని బాలయ్య కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ - సంక్రాంతికి వస్తున్నాం.. రెండు సినిమాలు దిల్ రాజువే. అలాగే ఎలాంటి గోడవ రాకుండా ముందుగా డాకు మహరాజ్ నైజాం హక్కులు కొనేసి సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి దిల్ రాజు ఇష్ట ప్రకారం థియేటర్స్ కేటాయింపులు ఉంటాయి. కానీ ఈ క్రమంలో డాకు మహరాజ్ కు ఎక్కువ థియేటర్స్ లేకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడిందని టాక్. ఆ కారణంగా హీరోగా తన బిజినెస్ కోణంలో బాలయ్య అప్సెట్ అయ్యి ఉండవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.