Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ బాలయ్య.. రాజమౌళికి హీరో.. సందీప్ సినిమాలో విలన్..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 11:01 AM GMT
అన్ స్టాపబుల్ బాలయ్య.. రాజమౌళికి హీరో.. సందీప్ సినిమాలో విలన్..!
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ సీజన్ లో లేటెస్ట్ గా యువ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ శ్రీలీల అతిథులుగా వచ్చారు. నవాన్ పొలిశెట్టి రావడం రావడమే బాలయ్య మీద ఒక కవిత చెప్పి ఆయన్ను ఇంప్రెస్ చేశాడు. అంతేకాదు బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ ఫోటో ఇచ్చాడు.

ఇక ఆ తర్వాత షోలోకి శ్రీలీల కూడా వచ్చింది. నవీన్ పొలిశెట్టి తన కెరీర్ మొదట్లో జరిగిన విషయాల గురించి చెప్పుకొచ్చాడు. రణ్ వీర్ సినిమాలో ఫోటో గ్రాఫర్ రోల్ అని అందరికీ చెప్పి అక్కడికి వెళ్తే తనలా 50 మంది ఉన్నారని అన్నాడు. మళ్లీ అదే రణ్ వీర్ చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అందుకున్నానని అని చెప్పుకొచ్చాడు నవీన్ పొలిశెట్టి.

ముంబై వెళ్లడానికి ముందు ఇక్కడే ట్రై చేశా కానీ ఫ్రెండ్ సలహాతో ముంబై వెళ్లి అక్కడ యూట్యూబ్ వీడియోస్ చేశా ఆ వీడియో చూసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆఫర్ వచ్చిందని అన్నాడు నవీన్. ఇక శ్రీలీల కూడా చిన్నప్పటి నుంచి డ్యాన్స్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉందని చెప్పింది. సింగిల్ మదర్ గా అమ్మ అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేదని చెప్పింది శ్రీలీల.

ఇక ఇద్దరితో ఆటలు పాటలతో బాలకృష్ణ హుశారెత్తించారు. ఇక హార్ట్ బీట్ రౌండ్ లో నవీన్ కి రాజమౌళి సినిమా, సందీప్ వంగ సినిమా ఒకేసారి వస్తే ఏ సినిమా చేస్తావని అడిగారు బాలకృష్ణ. దానికి ఆన్సర్ గా కాస్త తడబడ్డ నవీన్ రాజమౌళి మహేష్ సినిమాతో బిజీ కాబట్టి ప్రభాస్ సినిమా చేశాక సందీప్ సినిమా చేస్తా.. ఆ తర్వాత రాజమౌళి సినిమా చేస్తానని అన్నాడు. ఐతే అప్పుడు బాలకృష్ణ తానైతే రాజమౌళి సినిమాలో హీరోగా సందీప్ వంగ సినిమాలో విలన్ గా చేస్తానని అన్నారు.

యువ హీరోయిన్స్ లో తనకు శ్రీలీల అంటే ఇష్టమని నవీన్ చెప్పగా.. విశ్వక్, సిద్ధు, విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, అడివి శేష్ లో శ్రీలీల రేటింగ్ ఎవరికి ఎలా అంటే.. నవీన్ పేరు ముందు చెప్పి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేనని చెప్పింది శ్రీలీల. ఇక తన జీవితంలో అన్ స్టాపబుల్ మూమెంట్ గురించి నవీన్ చెప్పాడు. ఒక టైం లో నవీన్ రెంట్ కట్టకపోతే రూం లో నుంచి వెళ్లమని చెబుతామని ఫ్రెండ్స్ డిసైడ్ అయినప్పుడు తనకు గీతలోని ఒక మాట బాగా నచ్చిందని.. ఫలితం ఆశించకుండా కష్టాన్ని నమ్ముకుంటే లక్ష్యం వైపు వెళ్తామని ఆ మాటతో తనలో మార్పు వచ్చిందని అన్నారు.

శ్రీలీల కూడా ఓ వైపు డాక్టర్ గా మరోవైపు యాక్టర్ గా రెండిటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయాలని ఉనని అన్నది. ఎపిసోడ్ లో భాగంగా డాక్టర్ అయినా కూడా వైద్యం అందని గ్రామాల్లో హెల్త్ క్యాంప్ లను నిర్వహిస్తూ ట్రైబల్ ఏరియాల్లో వైద్య సేవ అందిస్తున్న డాక్టర్ రవీంద్ర గురించి ఏవీ వేసి ఆయనను స్టేజ్ మీదకు పిలిచి సత్కరించారు.

అన్ స్టాపబుల్ సీజన్ 4 లో బాలయ్య ఎనర్జీని డబుల్ చేస్తూ నవీన్ పొలిశెట్టి, శ్రీలీల ఎపిసోడ్ ఆకట్టుకుంది. ఈ ఇద్దరు తమ మాటలతో ఎప్సోడ్ ని అదరగొట్టారు.