Begin typing your search above and press return to search.

డాకు మహారాజ్‌... ఎంత పని చేశావ్‌ వంశీ భయ్యా!

పట్టుబట్టి ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపిన నిర్మాత నాగవంశీపై నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 2:30 PM GMT
డాకు మహారాజ్‌... ఎంత పని చేశావ్‌ వంశీ భయ్యా!
X

బాలకృష్ణ, బాబీ కాంబోలో వచ్చిన 'డాకు మహారాజ్‌' సూపర్‌ హిట్ టాక్‌ దక్కించుకున్న రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టలేక పోయింది. అందుకు కారణం అదే సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద ఉండటం. డాకు మహారాజ్ సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ ఆడియన్స్‌ అంతా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వైపు పరుగులు తీశారు. కనుక డాకు మహారాజ్‌ సినిమాకు చాలా పెద్ద డ్యామేజ్ అయింది. ఒక వేళ సినిమా కు నెగటివ్‌ టాక్‌ వచ్చి ఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా దెబ్బకి మినిమం వసూళ్లు కూడా నమోదు అయ్యేవి కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పట్టుబట్టి ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపిన నిర్మాత నాగవంశీపై నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. మంచి సినిమాను మంచి సమయంలో విడుదల చేసి ఉంటే కచ్చితంగా రూ.250 కోట్లకు మించి వసూళ్లు రాబట్టి ఉండేది. అంతే కాకుండా తెలుగుతో పాటు ఒకేసారి హిందీ ఇతర భాషల్లోనూ విడుదల చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది కదా అంటూ నాగ వంశీని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన సినిమాను బాలకృష్ణ ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. కనుక డిసెంబర్‌లో అయినా విడుదల చేసి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాను ఎదుర్కొని నిలిచి డాకు మహారాజ్ సినిమా రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. గేమ్ ఛేంజర్‌ సినిమా మినిమం వసూళ్లను సొంతం చేసుకోలేక పోయింది. సంక్రాంతికి వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాల్సి ఉంటుంది. అలా ఉంటేనే జనాలు క్యూ కడతారు. యాక్షన్‌ సినిమాలను సంక్రాంతి వంటి సీజన్‌లో విడుదల చేయవద్దని ఇప్పటికైనా నిర్మాత నాగవంశీకి అర్థం అయిందా అంటూ కొందరు ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి సందర్భంగా కాకుండా అటు ఇటు రెండు లేదా మూడు వారాల ముందు లేదా తర్వాత వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న డాకు మహారాజ్ అదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. డాకు మహారాజ్‌ సినిమా ఓటీటీ వరల్డ్‌లో నెం.1 గా దూసుకు పోతుంది. పలు హిందీ సినిమాలు, సిరీస్‌లు ఉన్నా నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో డాకు మహారాజ్ నెం.1 స్థానంలో దూసుకు పోతుంది. స్ట్రీమింగ్‌ అయిన రెండో వారంలోనూ డాకు మహారాజ్ జోరు కొనసాగుతోంది. పోటీగా మరే సినిమాలు లేకపోవడం వల్ల ఈ స్థాయి స్పందన లభిస్తుంది. కనుక థియేట్రికల్‌ రిలీజ్ సమయంలోనూ నాగవంశీ కాస్త ప్లాన్‌ చేసి విడుదల చేసి ఉండాల్సిందనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు, బాలకృష్ణ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.