బాలయ్య లైక్ చేసేది అతడినే!
నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో సినిమాలకు ఇప్పటి వరకూ ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి జూనియర్స్ వరకూ బాలయ్య కోసం ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్ లు అందించారు.
By: Tupaki Desk | 5 Jan 2025 10:30 PM GMTనటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో సినిమాలకు ఇప్పటి వరకూ ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి జూనియర్స్ వరకూ బాలయ్య కోసం ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్ లు అందించారు. అయితే నెటి జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఫాంలో ఉంది థమన్...దేవి శ్రీప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా బాలయ్య సినిమాలకు పని చేసారు. మరి వీరిద్దరిలో బాలయ్య లైక్ చేసే సంగీత దర్శకుడు ఎవరు? అంటే..
బాలయ్య మరో ఆలోచన లేకుండా ఠక్కున థమన్ పేరు చెప్పారు. దీంతో బాలయ్య మనసులో మొదటి స్థానాన్ని థమన్ ఆ రకంగా కొట్టేసాడు. దేవి శ్రీ బాలయ్యకు మంచి పాటలు ఇచ్చారు. అయితే ఓ సినిమా సమయంలో దేవి శ్రీ- బోయపాటి శ్రీను మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. అప్పటి నుంచి బాలయ్య సినిమాలకు దేవి శ్రీని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోలేదు. నాటి నుంచి బోయపాటి థమన్ ని లైన్ లోకి తెచ్చారు. అప్పటి నుంచి బోయపాటి సినిమాలకు తమన్ మాత్రమే సంగీతం అందిస్తున్నారు.
బాలయ్య తాజా చిత్రం `డాకు మహారాజ్` కు కూడా తమన్ సంగీతం అందించారు. త్వరలో ప్రారంభం కానున్న `అఖండ-2` చిత్రానికి థమనే మ్యూజిక్ అందిస్తున్నారు. అంతకు ముందు రిలీజ్ అయిన `భగవంత్ కేసరి`, `వీరసింహారెడ్డి`, `అఖండ` చిత్రాలకు థమన్ సంగీతం సమకూర్చారు. అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టాయి. దీంతో థమన్ బాలయ్యకు ఓ సెంటిమెంట్ లా మారిపోయారు.
అందుకే బాలయ్య లైక్ థమన్ అయ్యారు. మును ముందు ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం థమన్ `అఖండ-2` పనుల్లోనే బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.