భయ్యాకి బాలయ్య పక్కా ఛాన్స్!
కానీ పక్కాగా పూరికి డేట్లు ఇచ్చే ఓ అభిమాన హీరో ఉన్నారు. అతనే నటసింహ బాలకృష్ణ. ఇద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Dec 2024 2:30 PM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తదుపరి ఏ హీరోతో సినిమా చేస్తాడు? అన్న దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సిద్దు జొన్నలగడ్డ, గోపీచంద్ ఇలా కొంత మంది హీరోలతో పూరి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది వాళ్లలో ఎవరో ఒకరితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. సిద్దు జొన్నల గడ్డ ఫాంలో ఉన్నాడు. ఇప్పుడు పూరితో సినిమా అంటే అతడికి రిస్క్ అనే వాదన తెరపైకి వస్తోంది.
ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ పూరితో అలాగే సినిమా చేసి రేసులో వెనుకబడ్డాడు? అనే ఎగ్జాంపుల్ తెరపైకి తెస్తున్నారు. అవన్నీ ఆలోచిస్తే జొన్నలగడ్డ రిస్క్ తీసుకునే అవకాశం తక్కువ. ఇక మెగాస్టార్ చిరంజీవి కోసం 'ఆటోజానీ' కథకు రిపేర్లు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం తెలియాల్సి ఉంది. ఇక మ్యాచో స్టార్ గోపీచంద్ తో ప్రాజెక్ట్ మాత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయం టున్నారు. కానీ వీటిలో ఏది కన్పమ్ న్యూస్ కాదు. ఫలానా స్టార్ డేట్లు ఇస్తాడని క్లారిటీ చెప్పలేని పరిస్థితి.
కానీ పక్కాగా పూరికి డేట్లు ఇచ్చే ఓ అభిమాన హీరో ఉన్నారు. అతనే నటసింహ బాలకృష్ణ. ఇద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. కలిసి 'పైసా వసూల్' సినిమా చేసారు. అప్పటి నుంచి మంచి స్నేహితు లైపోయారు. పూరిని భయ్యా? అంటే ఎంతో ఆప్యాయంగా బాలయ్య పిలుస్తారు. కల్మషం లేని మనసు, మనిషి అంటూ పూరి వ్యక్తిత్వాన్ని కొనియాడుతారు. బాలయ్య గురించి పూరి మనసులో మాట అదే.
కోపం ఎక్కువైనా బాలయ్య మనసు మాత్రం వెన్న అంటారు. 'పైసా వసూల్' సమయంలో ఇద్దరు కలిసి వెంటనే మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ అప్పుడు పూరి కి ఇతర ప్రాజెక్ట్ లు ఉండటంతో సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో పూరి కష్టకాలంలో అవకాశం అడిగితే బాలయ్య నో చెప్పకుండా చేద్దాం అనే పాజిటిట్ మాట రావడం ఖాయమని అంటున్నారు. ఆ రకంగా పూరికి బాలయ్య రూపంలో మరో ఛాన్స్ కనిపిస్తుంది.