ఇది బాలయ్య గొప్పతనం!
హైజనిక్ గా ఉంటుందని చెప్పినా బాలయ్య వినరుట. ప్రొడక్షన్ పుడ్ తినే తాను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని.. ఉత్సాహంగా ఉరకలేస్తున్నానని చెబుతారుట.
By: Tupaki Desk | 23 Jan 2025 10:30 PM GMTస్టార్ హీరోలు సెట్స్ కి వచ్చారంటే? వాళ్లకు ఆన్ సెట్స్ లో నిర్మాత సకల సౌకర్యాలు కల్పించాలి. సెట్స్ కి వచ్చిన ప్పటి నుంచి ప్యాకప్ చెప్పే వరకూ హీరో అడిగింది క్షణాల్లో ముందుంచాలి. తినే తిండి నుంచి తాగే నీరి వరకూ అంతా హైజనిక్ గా ఉండాలి. ఖరీదైన అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్ర స్నాక్స్ ఇలా ప్రతీది స్టార్ హోటల్స్ నుంచి తెప్పించాలనే డిమాండ్ ఉంటుంది. కొంత మంది హీరోలు మాత్రం ఇంటి నుంచి పుడ్ తెప్పించు కుంటారు.
ఇది వారి ఇష్టాలను..ఆరోగ్య సూత్రాలను బట్టి ఉంటుంది. స్టార్ హీరో ప్రొడక్షన్ పుడ్ తినడానికి ఛాన్స్ ఉండదు. కానీ నటసింహ బాలకృష్ణ మాత్రం స్టార్ హీరోలకు భిన్నం. తానెంత పెద్ద స్టార్ అయినా సరే సెట్స్ కి వెళ్లారంటే ప్రొడక్షన్ పుడ్ మాత్రమే తీసుకుంటారుట. బాలయ్య ఇంటి పక్కన షూటింగ్ జరిగినా సరే ఇంటికి వెళ్లకుండా ప్రొడక్షన్ వాళ్లకి ఏం పుడ్ వండితే వాళ్లతో పాటు అదే తింటారుట. బాలయ్య సతీమణి ఇంటి నుంచి పుడ్ పంపిస్తానన్నా ఒప్పుకోరుట.
హైజనిక్ గా ఉంటుందని చెప్పినా బాలయ్య వినరుట. ప్రొడక్షన్ పుడ్ తినే తాను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని.. ఉత్సాహంగా ఉరకలేస్తున్నానని చెబుతారుట. నేను ఇలా ఆరోగ్యంగా ఉండటం నీకు ఇష్టం లేదా? అని జోకు లేస్తుంటారుట. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్లం. ఎంత స్టార్ హోటల్ అయితే మాత్రం వాళ్లెమైనా బంగారంతో చేస్తారా? ప్రొడక్షన్ పుడ్ ని మంచి గొప్ప ఆహారం ఏముంటుందని బాలయ్య అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి బాలయ్య ఎంత సింపుల్ గా ఉంటారు? అన్నది అర్దమవుతుంది.
మనిషి కటువుగా, కోపంగా ఉన్నా మనసు మాత్రం వెన్న అని ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. తాజాగా మరోసారి బాలయ్య ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు ? అన్నది అర్దమవుతుంది. దటీజ్ బాలయ్య. ఇది బాలయ్య గొప్పతనం. తెలుగు హీరోల్లో చాలా మంది ఇంటి నుంచి పుడ్ తెచ్చుకుంటారు. ప్రొడక్షన్ పుడ్ అన్నది ఔట్ డోర్ షూటింగ్ లో స్పెషల్ గా వండితే తింటారు తప్ప లేదంటే? ప్రొడక్షన్ పుడ్ తీసుకోరు. సమీపంలో ఉన్న స్టార్ హోటల్స్ నుంచి పుడ్ తెప్పించాల్సి ఉంటుంది. కానీ బాలయ్య నిర్మాతలకు ఆ ప్రాబ్లం లేదు.