Begin typing your search above and press return to search.

బాలయ్య కూడా పోటీలో దిగేలా ఉన్నాడు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Sep 2024 4:44 AM GMT
బాలయ్య కూడా పోటీలో దిగేలా ఉన్నాడు
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో యాక్షన్ అండ్ కమర్షియల్ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా భారీ షెడ్యూల్ ని బాబీ కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూజ్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా సిద్ధం అవుతోంది. త్వరలో మూవీ టైటిల్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. అయితే డిసెంబర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ రిలీజ్ కాబోతోంది. అలాగే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

దాంతో పాటు నితిన్ ‘రాబిన్ హుడ్’, నాగ చైతన్య ‘తండేల్’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి కాకుండా కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు డిసెంబర్ రేసులో ఉన్నాయి. ఇంత పోటీ మధ్య రిలీజ్ చేయడం రిస్క్ అని భావించి NBK109 విడుదల సంక్రాంతి సీజన్ కి షిఫ్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో వస్తున్నారు. అలాగే వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో రాబోతున్నారు.

‘విశ్వంభర’ జనవరి 10న, ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 11న రిలీజ్ కాబోతున్నాయి. అయితే బాలయ్య సినిమాలని వీటికంటే ముందుగా రిలీజ్ చేయాలని జనవరి 9న డేట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆల్ మోస్ట్ ఇదే డేట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. త్వరలో మేకర్స్ టైటిల్ పోస్టర్ రిలీజ్ తో పాటు అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సంక్రాంతిలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆడియెన్స్ సపోర్ట్ అందరికి ఉంటుంది.

కేవలం కంటెంట్ క్లిక్కయితే చాలు కలెక్షన్స్ గట్టిగా పెరుగుతాయి. కాబట్టి సంక్రాంతి బెటర్ అని బాలయ్య టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక NBK109 షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ 2’ మూవీ షూటింగ్స్ స్టార్ట్ చేస్తాడనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ‘అఖండ 2’ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది.