Begin typing your search above and press return to search.

NBK లైఫ్ & కెరీర్ బెస్ట్ ఫేజ్ ఇదే

ఎన్బీకే ప్రత్యేక విజయాన్ని నంద‌మూరి అభిమానులు సెల‌బ్రేట్ చేసుకుంటుండ‌గా, తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖుల్లో ప‌ద్మవిభూష‌ణ్ గ్ర‌హీత‌ చిరంజీవి ప్ర‌త్యేకంగా బాల‌య్య‌కు విషెస్ తెలిపారు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 6:59 AM GMT
NBK లైఫ్ & కెరీర్ బెస్ట్ ఫేజ్ ఇదే
X

టాలీవుడ్ న‌టుడిగా, రాజకీయ నాయకుడిగా, బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి ఛైర్మ‌న్‌గా నందమూరి బాలకృష్ణ విశిష్ఠ సేవ‌లను గుర్తించిన‌ భారత ప్రభుత్వం దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌తో సత్కరించింది. ఐదు దశాబ్దాలకు పైగా సమాజానికి ఆయన సేవ‌లందించ‌గా పద్మ పుర‌స్కారం వ‌రించింది.

ఎన్బీకే ప్రత్యేక విజయాన్ని నంద‌మూరి అభిమానులు సెల‌బ్రేట్ చేసుకుంటుండ‌గా, తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖుల్లో ప‌ద్మవిభూష‌ణ్ గ్ర‌హీత‌ చిరంజీవి ప్ర‌త్యేకంగా బాల‌య్య‌కు విషెస్ తెలిపారు. మహేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, రవితేజ, కళ్యాణ్ రామ్, బాలయ్య దర్శకులు బాబీ కొల్లి, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాతలు దిల్ రాజు, నాగ వంశీ, మైత్రి మూవీ మేకర్స్, డివివి అధినేత దాన‌య్య‌ స‌హా ప‌లువురు తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖులు శుభాభివంద‌న‌లు తెలిపారు. న‌టుడిగా నాయ‌కుడిగా ఆయ‌న సేవ‌ల‌ను వీరంతా కొనియాడారు.

కెరీర్ అత్యున్న‌త స్థితిలో ఉన్న ఎన్బీకే ఇటీవ‌ల వ‌రుస‌గా నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నారు. బోయ‌పాటితో అఖండ‌, గోపిచంద్ మ‌లినేనితో వీర‌సింహారెడ్డి, అనీల్ రావిపూడితో భ‌గ‌వంత్ కేస‌రి, బాబీ కొల్లితో డాకు మ‌హారాజ్ ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. ఇది కెరీర్ బెస్ట్ ఫేజ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. హిందూపురం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు బాల‌య్య‌. ఇది కెరీర్ ప‌రంగా, లైఫ్ జ‌ర్నీ ప‌రంగాను అత‌డికి బెస్ట్ ఫేజ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని అభిమానులు ఎంతో ఉత్సాహంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ 1974లో 'తాతమ్మ కల' చిత్రంతో బాల నటుడిగా ఆరంగేట్రం చేశారు. అప్పటి నుండి న‌టుడిగా ఇంతింతై ఎదిగారు. 64 ఏళ్ల వ‌య‌సులోను వ‌రుస విజ‌యాల్ని సాధిస్తున్నారు. ఇప్ప‌టికే 100 పైగా సినిమాల్లో నటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి బాలయ్య క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.