'నా చిన్నప్పుడు బాలకృష్ణ నన్ను డిన్నర్ కి తీసుకెళ్లారు'.. అన్‌స్టాపబుల్ లో రామ్ చరణ్
చిరంజీవి ఫ్యామిలీ చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన కొత్తలో, బాలకృష్ణ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వచ్చి మరీ నైట్ డిన్నర్ కి తీసుకెళ్లారనే విషయాన్ని రామ్ చరణ్ ఈ షోలో వెల్లడించారు.
By: Tupaki Desk | 8 Jan 2025 3:49 PM GMTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ''అన్‌స్టాపబుల్''. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రచారం అవుతున్న ఈ షోకి విశేష ఆదరణ లభించింది. ఇప్పటికే మూడు సీజన్లలో అదరగొట్టిన బాలయ్య.. నాలుగో సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, అల్లు అర్జున్, సూర్య, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, నవీన్ పోలిశెట్టి, శ్రీలీల వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ షోలో సందడి చేసారు. 'అన్‌స్టాపబుల్ సీజన్-4' లేటెస్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రోమోలతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మెగా పవర్ ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
'అన్‌స్టాపబుల్ సీజన్-4'లో ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో గెటప్ లో వచ్చే బాలకృష్ణ.. ఈసారి 'పైసా వసూల్' సినిమాలోని తేడా సింగ్ గెటప్ లో సందడి చేసారు. నా జగ్గూ డైరెక్షన్ లో చేసిన సినిమా అంటూ, దానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ తర్వాత ''మెగాస్టార్ తనయుడిగా పుట్టాడు.. బాబాయ్ పవర్ స్టార్ పవర్ తో పెరిగాడు.. ఇద్దరి శక్తి తోడుకొని పాన్ ఇండియా లెవెల్ లో మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు'' అంటూ రామ్ చరణ్ ను ఆహ్వానించడంతో ఈ అన్ ప్రిడిక్టబుల్ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. 'డ్యాన్సుల్లో తండ్రికి తగ్గ తనయుడు.. సంస్కారంలో తండ్రిని మించిన తనయుడు.. ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో తెలిసిన వినయ విధేయుడు' అంటూ బాలయ్య చెప్పిన మాటలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
'బ్రో' అని బాలయ్య పిలవమంటే.. 'బ్రో సార్, బాలా బ్రో సార్' అంటూ రామ్ చరణ్ పిలుస్తాడు. మిమ్మల్ని బ్రో అని పిలిస్తే ఇంట్లో నాకు ఒక కర్రీ రెడీ చేసి పెడతారంటూ చెర్రీ చెప్పగా.. ''బ్రో చిరంజీవి.. ఇతను నా బ్రదర్.. కర్రా గిర్రా తీస్తే నేను ఊరుకోను.. మేమిద్దరం మీ ఇంటి ముందుకొచ్చి తొడగొడతాం'' అంటూ బాలయ్య నవ్వులు పూయించారు. ''45 ఏళ్లుగా మీ నాన్నతో నువ్వా నేనా అనే విధంగా కాంపిటేషన్ ఉండేది.. ఇప్పుడు నీతో కాంపిటీషన్'' అని బాలకృష్ణ నవ్వుతూ అనడం అలరిస్తుంది. ఇక స్క్రీన్ మీద యాక్టింగ్ స్కూల్ లో చరణ్ వీడియోని ప్రదర్శించి సర్ప్రైజ్ చేశారు.
చిరంజీవి ఫ్యామిలీ చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన కొత్తలో, బాలకృష్ణ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వచ్చి మరీ నైట్ డిన్నర్ కి తీసుకెళ్లారనే విషయాన్ని రామ్ చరణ్ ఈ షోలో వెల్లడించారు. అలానే మీ అమ్మ రొయ్యలు, ఆమ్లెట్ అదరగొడుతుందని చరణ్ తో బాలయ్య చెబుతారు. చరణ్ కు కుమార్తె పుట్టడం గురించి మాట్లాడుతూ.. ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్లే అని ఎమోషనల్ గా చెబుతారు. ఓవరాల్ గా మెగా - నందమూరి ఫ్యామిలీల మధ్య అనుబంధం గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలియజేసారు. ఆసక్తికరమైన విషయాలతో, సరదా సంభాషణలతో సాగిన బాలయ్య - చరణ్ ల 'అన్‌స్టాపబుల్' లేటెస్ట్ ఎపిసోడ్.. ఒకరకంగా మెగా - నందమూరి ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి.
రామ్ చరణ్ ను పవన్ కల్యాణ్ ఏమని పిలుస్తాడు? ప్రభాస్ - చరణ్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? ప్రభాస్ తో చెర్రీ ఫోన్ కాల్ లో ఏం మాట్లాడాడు? అనవసరం చేసానని చరణ్ ఫీల్ అయిన సినిమా ఏది? ప్రభాస్ - మహేష్ లలో ఎవరితో మల్టీస్టారర్ చేయడానికి ఇష్టపడతాడు? సమంత, అలియా భట్, కియారా అద్వానీలో ఎవరిని ఎంచుకుంటాడు? ఫ్యామిలీలో ఎవరి డామినేషన్ ఉంటుంది? చరణ్ కు ఇష్టమైన సినిమా ఏంటి? వంటి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'అన్‌స్టాపబుల్ 4' తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.
https://www.aha.video/webepisode/unstoppable-s04-ep9