Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలకృష్ణ ఏమన్నారంటే..

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Sep 2024 7:52 AM GMT
మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలకృష్ణ ఏమన్నారంటే..
X

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకోవడంతో పాటు హీరోయిక్ లుక్ లోకి తనని తాను ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకుంటున్నాడు. ఫ్యాన్స్ అయితే మోక్షజ్ఞ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. వారసుడి డెబ్యూ సినిమా కోసం బాలకృష్ణ కూడా చాలా మంది దర్శకులతో సంప్రదింపులు జరిపినట్లు టాక్ వినిపించింది.

ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఎంట్రీ ముహూర్తం ఖరారైందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సూపర్ హీరో కథతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సెప్టెంబర్ 6న ఈ సినిమా రామకృష్ణ స్టూడియోస్ లో లాంచ్ కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తాజాగా బాలకృష్ణ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబందించిన మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, మూడు నెలల్లో షూటింగ్ కూడా మొదలు కాబోతోందని బాలయ్య చెప్పుకొచ్చారు. త్వరలోనే సినిమాపై అఫీషియల్ ప్రకటన వస్తుందని అన్నారు. మోక్షజ్ఞ మీద ఫ్యాన్స్ లో చాలా అంచనాలు ఉన్నాయి. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ గా మారిపోయాడు.

వాడి లైన్ అప్ లో ఐదారు స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. మోక్షజ్ఞ లాంచింగ్ పై నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. అని బాలకృష్ణ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బాలయ్య 50 ఏళ్ళ నటప్రస్థానం సందర్భంగా ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా బాలకృష్ణ చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోయే సినిమాపై కూడా స్పష్టత ఇచ్చారు.

అభిమాన్యుడి క్యారెక్టర్ స్ఫూర్తితో మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ కథని సిద్ధం చేసాడంట. అదిరిపోయే రేంజ్ లో ఈ మూవీ కథాంశం కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో ఫ్రాంచైజ్ లో భాగంగానే ఈ చిత్రం సిద్ధం అవ్వబోతోందనే ప్రచారం నడుస్తోంది. మోక్షజ్ఞకి హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.