Begin typing your search above and press return to search.

ఆ హిందీ మూవీ హిట్ అయితే బాలయ్య రీమేక్ చేస్తాడా?

బాలీవుడ్‌లో సౌత్‌ ఇండియా దర్శకులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళ దర్శకులతో అక్కడ పెద్ద హీరోలు సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు

By:  Tupaki Desk   |   26 March 2025 4:31 AM
Balakrishna Turns Down Gopichand’s Jaat
X

బాలీవుడ్‌లో సౌత్‌ ఇండియా దర్శకులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళ దర్శకులతో అక్కడ పెద్ద హీరోలు సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. సందీప్ రెడ్డితో రణబీర్ కపూర్‌ 'యానిమల్‌' సినిమా చేసిన విషయం తెల్సిందే. మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్ 'సికిందర్‌' సినిమాను చేశాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్‌ 'జాట్‌' సినిమాను చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన జాట్ సినిమాను వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జాట్ సినిమాను మొదట రవితేజ హీరోగా చేయాలని గోపీచంద్ మలినేని భావించాడు. కానీ బడ్జెట్‌ కారణాల వల్ల సినిమా చేతులు మారింది.

ఈ సినిమాను హిందీలో సన్నీ డియోల్‌తో చేస్తూనే తెలుగులోనూ రూపొందించాలని దర్శకుడు గోపీచంద్ మలినేని అనుకున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ వారు సైతం అందుకు ఓకే చెప్పారు. బాలకృష్ణతో అప్పటికే గోపీచంద్ మలినేని 'వీర సింహారెడ్డి' సినిమాను తీసి హిట్‌ ఇచ్చాడు. కనుక బాలకృష్ణ మరోసారి గోపీచంద్‌తో సినిమాకు ఓకే చెప్పాడు. దాంతో జాట్‌ సినిమాను హిందీలో సన్నీ డియోల్‌తో చేస్తూనే అదే సమయంలో తెలుగులో బాలకృష్ణతో చేయాలని భావించాడు. కొన్ని సీన్స్‌ కామన్‌గా తీసి హీరోల సినిమాలను విడి విడిగా తీయాలని భావించాడు. గోపీచంద్‌ ప్రతిపాధించిన ప్రాజెక్ట్‌కు మైత్రి మూవీ మేకర్స్‌ ఓకే చెప్పి బాలకృష్ణకు అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్ధం అయిందట. కానీ బాలయ్య తిరస్కరించారని సమాచారం.

జాట్ సినిమాను సన్నీ డియోల్‌తో తీస్తూ మరో వైపు తెలుగులో తనతో తీసేందుకు గోపీచంద్‌ మలినేని పెట్టిన ప్రతిపాధనను బాలకృష్ణ సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జాట్ తర్వాత గోపీచంద్‌తో బాలకృష్ణ సినిమాకు ఓకే చెప్పాడట. అయితే ఆ సినిమా కథ ఏంటి అనే విషయంలో ఇంకా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. జాట్ సినిమాను బాలకృష్ణతో తీయాలని గోపీచంద్‌ మలినేని బలంగా కోరుకున్నాడు. కనుక ఒకవేళ హిందీలో హిట్ అయితే అదే రీమేక్ ప్రపోజల్‌ను బాలకృష్ణ ముందు గోపీచంద్‌ మలినేని ఉంచే అవకాశాలు ఎక్కువ అనే టాక్‌ వినిపిస్తుంది. హిట్‌ మూవీని రీమేక్ చేస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు.

జాట్ సూపర్‌ హిట్ అయినంత మాత్రాన బాలకృష్ణ నుంచి గ్రీన్ సిగ్నల్‌ వస్తుందా అంటే అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలకృష్ణ ఎక్కువగా రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపించడు అనేది టాక్‌. అందుకే గోపీచంద్‌ మలినేనితో సినిమాకు బాలయ్య ఓకే చెప్పినా అది రీమేక్ అయ్యి ఉండక పోవచ్చు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా రీమేక్ గురించి గోపీచంద్‌ మలినేని కానీ, మైత్రి మూవీ మేకర్స్ కాని ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఫలితం వచ్చిన తర్వాత ఏమైనా చర్చలు జరుగుతాయేమో చూడాలి. ప్రస్తుతం బాలయ్య ఉన్న ఫామ్‌ నేపథ్యంలో జాట్‌ వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్‌ సినిమాలో నటించడం మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ 2'ను చేస్తున్నాడు. ఆ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమాపై మరింత క్లారిటీ ఈ ఏడాది చివరి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.