Begin typing your search above and press return to search.

బాలకృష్ణకి ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు..?

ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా తన సోదరులతో బాలకృష్ణకు ప్రశ్నావళి ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 3:54 AM GMT
బాలకృష్ణకి ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు..?
X

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నందమూరి ఫ్యామిలీ అంతా ఒక స్పెషల్ ఈవెంట్ ని కండక్ట్ చేశారు. నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఐతే ఈ ఈవెంట్ లో బాలకృష్ణ స్పీచ్ అదిరిపోయింది. ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా తన సోదరులతో బాలకృష్ణకు ప్రశ్నావళి ఏర్పాటు చేశారు. 7:30 గంటలకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తవు.. అడిగితే పూజలో ఉన్నా అని అంటావని పురందేశ్వరి అడిగితే.. దానికి సమాధానంగా సన్యాసి సంసారం గురించి చెప్పారు బాలయ్య.

ఇక మరో సోదరి నారా భుననేశ్వరి మీరు నటించిన కథానాయికల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరని అడిగితే.. ఆయన కాస్త చెప్పడానికి తడపడితే అనిల్ రావిపూడి కాస్త సాయం చేశాడు. అనిల్ సిమ్రాన్ అని అంటే బాలకృష్ణ కూడా సిమ్రాన్ అని చెప్పాడు. ఒక్కరి పేరు చెప్పలేకపోతే ముగ్గురు పేర్లు చెప్పండని అన్నారు భువనేశ్వరి. అప్పుడు బాలకృష్ణ ఫస్ట్ విజయశాంతి, సెకండ్ రమ్యకృష్ణ, థర్డ్ సిమ్రాన్ అని చెప్పారు.

సో అనిల్ రావిపుడి చెప్పిన సిమ్రాన్ బాలాకి థర్డ్ ప్లేస్ అని అనిల్ తో అన్నారు భువనేశ్వరి. మొత్తానికి సోదరుడికి పద్మభూషణ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా నందమూరి ఫ్యామిలీ అంతా కూడా ఒకచోట కలిసి ఈ స్పెషల్ వేడుకని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలో బాలయ్యతో పనిచేసిన దర్శకులు కూడా పాల్గొన్నారు. గోపీచంద్ మలినేనికి బాలయ్య ముద్దు ఇచ్చి మన సినిమా వస్తుందని చెప్పమని అన్నారు.

ఈ అవార్డ్ తనలో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని రాబోయే సినిమాలతో మరింత అలరించే సినిమాలు చేస్తానని బాలయ్య చెప్పారు. ఈమధ్యనే డాకు మహారాజ్ తో బాలకృష్ణ తన ఖాతాలో సక్సెస్ వేసుకున్నారు. ఇక నెక్స్ట్ అఖండ 2 రాబోతుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా సీనియర్ హీరోల్లో బాలకృష్ణ దూకుడు చూస్తుంటే నందమూరి ఫ్యాన్స్ కి జోష్ ఫుల్ గా ఉంది. బాలకృష్ణ తన డైరెక్షన్ లో సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 కూడా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోపక్క బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.