ఆదివారం అంటే బాలయ్యకు టెర్రర్!
తాజాగా బాలయ్యకు ఉన్న మరో సెంటిమెంట్ గురించి రివీల్ చేసారు.
By: Tupaki Desk | 21 Jan 2025 7:30 AM GMTనటసింహ బాలకృష్ణ గొప్ప దైవ భక్తుడు. తాను ఏ పని చేయాలన్నా శుభ గడియలు చూసుకుని చేస్తారు. ఆయన నోట పద్యాలు..శ్లోకాలు ఏ రేంజ్ లో వస్తాయో తెలిసిందే. అంత గొప్ప జ్ఞాపక శక్తి..మేథస్సు బాలయ్యకు ఉండటం అన్నది ఎంతో గొప్ప విషయం. భారతదేశంలో ఎంతో మంది హీరోలున్నారు. ఆయనలా పద్యాలు..శ్లోకాలు ఇంకెవరూ పలకరు. అది నటసింహానికి మాత్రమే సాధ్యం. తాజాగా బాలయ్యకు ఉన్న మరో సెంటిమెంట్ గురించి రివీల్ చేసారు.
బాలకృష్ణది మూలా నక్షత్రం. అందుకే ఆదివారం రోజు నలుపు వస్త్రాలు ధరించరట. వాటికి చాలా దూరంగా ఉంటారుట. ఓసారి ఆసెంటిమెంట్ బ్రేక్ చేస్తే నడ్డి విరిగిందని నవ్వేసారు.` ఆదిత్య 369` షూటింగ్ సమయంలో ఆదివారం రోజు నలుపు వస్త్రాలు వేసుకుంటే కిందపడ్డారట. దీంతో నడుము విరిగిందన్నారు. అయితే అలా నలుపు దుస్తులు వేసుకున్న తర్వాత తన మనసుకు ఎందుకో కీడు శంకిస్తుందనే ముందే అనిపించిందట.
ఈ రోజు నలుపు వద్దు... సండే ఏం? జరుగుతుందో తెలియదని లోలోపల అనుకుంటున్నారట. కానీ ఎస్పీ బాల సుబ్రమణ్యం రాకరాక సెట్స్ కి వచ్చారు. ఆయన కళ్ల ముందే కింద పడ్డారట బాలయ్య. దీంతో నడుము విరిగి ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. అప్పటి నుంచి బాలయ్య ఆదివారం నలుపు దుస్తులు బ్యాన్ చేసారట. ఇంట్లో ఉన్నా సరే వాటి జోలికి వెళ్లరుట.
మరి షూటింగ్ ఆదివారం రోజు పడి...నలుపు దుస్తులు వేసుకోవాలని కాస్ట్యూమ్ డిజైనర్ సూచిస్తే పరిస్థితి ఏంటి? అంటే ఆ రోజు వరకూ నలుపు వస్తాలకు దూరంగా ఉండే సన్నివేశాలు షూట్ చేసి ..మరుసటి రోజు బ్లాక్ డ్రెస్ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. బాలయ్య ఆదేశించిన తర్వాత దానికి తిరుగుండదు. సెట్లో అందరూ వినాల్సిందే. బాలయ్య దర్శకుల హీరో అయినా ఆదివారం మాత్రం దర్శకుడు బాలయ్య మాటే వినాలి.