Begin typing your search above and press return to search.

తమన్‌కి బాలకృష్ణ ఖరీదైన బహుమానం

తన నాలుగు సినిమాలు విజయంలో తమన్‌ అందించిన సంగీతం కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించింది అని బాలకృష్ణ బలంగా నమ్ముతున్నారు.

By:  Tupaki Desk   |   15 Feb 2025 4:41 AM GMT
తమన్‌కి బాలకృష్ణ ఖరీదైన బహుమానం
X

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నాడు. నాలుగు వరుస విజయాలను సొంతం చేసుకుని డబుల్‌ హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అఖండ 2 సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. అఖండ 2 సినిమా బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే దసరా కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.


బాలకృష్ణ నటించి సూపర్‌ హిట్‌ అయిన నాలుగు సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించాడు. అఖండ, డాకు మహారాజ్ సినిమాలోని బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌కి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా అంటే తమన్ తప్ప మరెవ్వరు సంగీతాన్ని అందించిన ఆ స్థాయిలో ఆకట్టుకోలేరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే అఖండ 2 సినిమాకు సైతం తమన్‌తోనే సంగీతాన్ని చేయిస్తున్న విషయం తెల్సిందే. వరుసగా నాలుగు సినిమాలకు వర్క్‌ చేసిన నేపథ్యంలో బాలకృష్ణ, తమన్‌ల మధ్య చాలా క్లోజ్‌ బాండ్‌ పెరిగింది. ఆ మద్య ఒక ఇంటర్వ్యూలోనూ తమన్‌ అదే అన్నారు.


తమన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ గారు తనకు అన్నయ్య అంటూ తన అభిమానంను చూపించారు. ఆయన కోసం ప్రాణం పెట్టి వర్క్ చేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తన నాలుగు సినిమాలు విజయంలో తమన్‌ అందించిన సంగీతం కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించింది అని బాలకృష్ణ బలంగా నమ్ముతున్నారు. అందుకే తాజాగా తమ్ముడు తమన్‌కి ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. బాలకృష్ణ నుంచి ఇంతటి ఖరీదైన కారును బహుమానంగా దక్కించుకున్న తమన్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఒక సంగీత దర్శకుడు ఇలా గిఫ్ట్‌ అందుకోవడం మనం చూసిందే లేదు.

తన సంగీతంతో సినిమా ఫలితాన్ని మార్చేయగల సత్తా ఉన్న సంగీత దర్శకులు కొంత మంది ఉన్నారు. వారిలో తమన్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన పాటలతో పాటు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలోనూ తనను మరెవ్వరూ బీట్‌ చేయలేరు అనే స్థాయికి తమన్ చేరారు. పుష్ప 2 సినిమా కోసం దేవి శ్రీ తో కాకుండా తమన్‌ తో కొన్ని సన్నివేశాలకు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ చేయించే ప్రయత్నాలు జరిగాయి అంటే ఆయన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఈమధ్య కాలంలో ఎంతగా ఆధరణ దక్కించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మూవీ ఓజీకి సైతం తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇవే కాకుండా తమన్‌ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.