డాకు మహరాజ్.. హై వోల్టేజ్ కిక్!
హీరో క్యారెట్రైజేషన్ ఎలివేట్ చేసే విధంగా పవర్ఫుల్ గా ఉన్న ఈ లిరికల్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
By: Tupaki Desk | 14 Dec 2024 6:28 PM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ మూవీ సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
కచ్చితంగా సంక్రాంతి రేసులో బాలయ్యకి ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హీట్ రావడం ఖాయం అని అనుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. హీరో క్యారెట్రైజేషన్ ఎలివేట్ చేసే విధంగా పవర్ఫుల్ గా ఉన్న ఈ లిరికల్ వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి తమన్ స్వరాలు సమకూర్చారు. నకాష్ అజీజ్, భరత్ రాజ్, రితిష్ జి రావు, కె ప్రణతి ఈ సాంగ్ ని ఆలపించారు.
ది రేజ్ ఆఫ్ డాకు టైటిల్ తో ఈ ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. ఇందులో ‘డాకు మహారాజ్’ పోరాటం ఎలా ఉంటుంది. ఎందుకోసం అతను పోరాడుతున్నాడు. పేద ప్రజల గుండెల్లో అతనికున్న స్థానాన్ని రిప్రజెంట్ చేశారు. హైవోల్టేజ్ లో ఈ సాంగ్ ఉండటం విశేషం. థియేటర్ లో ఈ పాట విన్నప్పుడు ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
వరుస హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య నుంచి మరో పవర్ ఫుల్ కథతో ‘డాకు మహారాజ్’ చిత్రం రాబోతోంది. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ ఈ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సీనిమా, శ్రీ చక్ర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అనుకుంటున్నారు.
ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశీ రౌతేలా హీరోయిన్స్ గా చేశారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవత్ కేసరి’ సినిమాలతో బాలయ్య వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన స్టోరీ సెలక్షన్ కూడా ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటున్నాయి. అందుకే ‘డాకు మహారాజ్’ పైన కూడా అంచనాలు పెరిగిపోయాయి.