Begin typing your search above and press return to search.

బాలయ్య - దుల్కర్.. గెట్ రెడీ!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 5:23 AM GMT
బాలయ్య - దుల్కర్.. గెట్ రెడీ!
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అఖండ సినిమా నుంచి వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తనదైన స్టైల్‌లో యాక్షన్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అఖండతో మొదలైన ఈ విజయం ‘వీరసింహారెడ్డి’ మరియు ‘భగవంత్ కేసరి’ సినిమాలతో కొనసాగుతోంది. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో, బాలయ్య మార్కెట్ మరింత పెరిగింది.

కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా, బాలయ్య తన డైలాగ్ డెలివరీ, ఎనర్జీతో టాక్ షో హోస్ట్‌గా కూడా అదరగొట్టారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్’ షోతో బాలయ్య తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. ఎప్పుడూ మాస్ పాత్రల్లో కనిపించే బాలయ్య, ఈ షోలో మరోవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ముక్కుసూటి ప్రశ్నలు, సరదా సంభాషణలతో ఈ టాక్ షోని సక్సెస్ గా మలిచారు.

ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసిన ‘అన్ స్టాపబుల్’ నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. బాలయ్య ఈ షోలో పాల్గొనే అతిథులతో చమత్కారమైన సంభాషణలుతో ప్రేక్షకులను నవ్విస్తూనే, వారి వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికర అంశాలను బయటకు తీయనున్నారు. ఈ సీజన్ లో మరింత జోష్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

సీజన్ 4 షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అయితే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్‌గా సందడి చేయబోతున్నారు. ఆయనతో పాటు లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత నగవంశీ కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించనున్నారు.

దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ‘సీతారామం’ చిత్రంతో మరింత అభిమానులను సంపాదించుకున్న దుల్కర్, ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా కోసం వస్తున్నాడు. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కి మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందనే అంచనాలు ఉన్నాయి.

‘లక్కీ భాస్కర్’ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా టీమ్ బాలయ్యతో కలిసి ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొనబోతున్నారు. బాలయ్య వీరితో ఏ విధంగా సంభాషణలు జరిపారు? దుల్కర్ సల్మాన్ గురించి ఎలాంటి సీక్రెట్స్ బయటకు తీసుకు వస్తారో చూడాలి. ఇక ఈ తొలి ఎపిసోడ్‌పై త్వరలోనే స్పష్టమైన క్లారిటీ రానుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘అన్ స్టాపబుల్’ 4లో గత సీజన్స్ కంటే ఎక్కువ మంది స్టార్ సెలబ్రెటీలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.