Begin typing your search above and press return to search.

NBK సర్ ప్రైజ్. ఇది మాస్ అఫీషియల్

ఈ లుక్ చూసిన తర్వాత బాలకృష్ణ సూపర్ హీరో పాత్రలో నటించాబోతున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 9:45 AM GMT
NBK సర్ ప్రైజ్. ఇది మాస్ అఫీషియల్
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘NBK109’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ మూవీ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమా క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో బోయపాటి ఉన్నారు. మూవీ ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనూహ్యంగా బాలకృష్ణకి సంబందించిన ఒక న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా ఉంది.

సూపర్ హీరో తరహా కాస్ట్యూమ్ తో బాలకృష్ణ ఈ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసిన తర్వాత బాలకృష్ణ సూపర్ హీరో పాత్రలో నటించాబోతున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇది నిజమా కాదా అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్న సమయంలో ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది నిజమేనని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రాజెక్టు ఆల్ మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు. ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ అప్డేట్ అక్టోబర్ 11న దసరా కనుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారంట. అయితే ముందుగానే ఫస్ట్ లుక్ బయటకి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమాని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్నారా, లేదంటే వేరొక దర్శకుడితో ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది. సూపర్ హీరో పాత్రలో బాలయ్య నటిస్తే అతన్ని తెరపై ఏ విధంగా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బేసిక్ గా బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి.

అలాంటిది సూపర్ హీరో పాత్రలో ఓవర్ ది టాప్ లో బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేస్తే ఇక ఫ్యాన్స్ ని నిద్రపట్టదు అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. సూపర్ హీరో గెటప్ లో బాలయ్య లుక్ బయటకొచ్చిన తర్వాత ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్, స్టోరీస్ తో మూవీ చేసిన హీరోగా కూడా బాలయ్య తానేంటో నిరూపించుకున్నాడు. ఆదిత్య 369 టైం ట్రావెల్ కాన్సెప్ లో నటించిన మొదటి ఇండియా హీరోగా బాలయ్య నిలిచారు.

భైరవద్వీపంలో కురూపిగా, అఖండలో అఘోరగా బాలయ్య నటించి మెప్పించారు. ఇప్పుడు సూపర్ హీరోగా కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 11న రాబోయే ఈ మూవీ అప్డేట్ కోసం తెలుగు సినీ ప్రియులు అందరూ వెయిట్ చేస్తున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మెన్ అనే సినిమా చేశారు. హాలీవుడ్ స్ఫూర్తిగా చేసిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత తెలుగు లో ఎవ్వరు సూపర్ హీరో కథలు ప్రయత్నం చేయలేదు. మరల తేజ సజ్జా హనుమాన్ తో సూపర్ హీరో జోనర్ కథలు చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు బాలయ్య ఆ జోనర్ లో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడనే ప్రచారం వినిపిస్తోంది.