Begin typing your search above and press return to search.

బాల‌య్య కోసం ఆ ఇద్ద‌రూ పోటీనా?

న‌ట‌సింహ బాల‌కృష్ణ 110వ చిత్రంగా `అఖండ‌-2` దాదాపు ఖాయ‌మైన‌ట్లే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఆ చిత్రం తెర‌కెక్క‌నుంది

By:  Tupaki Desk   |   2 Jun 2024 9:34 AM GMT
బాల‌య్య కోసం ఆ ఇద్ద‌రూ పోటీనా?
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ 110వ చిత్రంగా `అఖండ‌-2` దాదాపు ఖాయ‌మైన‌ట్లే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఆ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాల‌య్య నుంచి కూడా లైన్ క్లియ‌ర్ గా ఉండ‌టంతో? ఎలాంటి సందేహాలు లేకుండా ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే బోయ‌పాటి ఆ సినిమా ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌ణ్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా బాల‌య్య కోసం అప్పుడే హీరోయిన్ వేట మొద‌లైపోయింద‌ని తెలుస్తోంది.

సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌వ‌డం ఇబ్బంది గా ఉండ‌టంతో బోయ‌పాటి ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారు. దీనిలో భాగంగా ప్ర‌ధానంగా ఇద్ద‌రి భామ‌ల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. కాజ‌ల్ అగ‌ర్వాల్, అంజ‌లి పేర్లు ప‌రిశీలిస్తున్నట్లు లీకులందుతున్నాయి. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌ర్ని ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. ఇద్ద‌రు బాల‌య్య తో ఇప్ప‌టికే సినిమాలు చేసారు. `డిక్టెట‌ర్` లో అంజ‌లి, `భ‌గ‌వంత కేస‌రి`లో కాజ‌ల్ అగ‌ర్వాల్ బాల‌య్య‌కి జోడీగా న‌టించారు.

`డిక్టెట‌ర్` ప్లాప్ అయినా రీసెంట్ గా రిలీజ్ అయిన `భగ‌వంత్ కేస‌రి` మాత్రం మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు బాల‌య్య ఆ ఇద్ద‌రిలో ఎవ‌రి వైపు చూస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. అంజ‌లితో బాల‌య్య కి మంచి ప్రెండ్. ఇద్ద‌రు ఎంత క్లోజ్ గా ఉంటారు? అన్న‌ది ఇటీవ‌లే ఓ సంద‌ర్భంలో ప్రూవ్ అయింది. అది కాస్త నెగిటివ్ గా స్ప్రెడ్ అయినా అంజ‌లి వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో అదంతా త‌ప్పుడు ప్ర‌చారమ‌ని త‌న‌కి-బాల‌య్య కి మ‌ధ్య ఉన్న స్నేహం గురించి చెప్పే ప్ర‌య‌త్నం చేసింది.

కాజ‌ల్ తో మ‌రీ అంత చ‌నువు కాక‌పోయినా? స‌క్సెస్ ఇచ్చిన హీరోయిన్ గా గుర్తింపు ఉంది. మ‌రి వీళ్లిద్ద‌రిలో బాల‌య్య ఆప్ష‌న్ ఎవ‌రు? అవుతారో చూడాలి. దీనిపై జూన్ 10న క్లారిటీ వ‌స్తుంద‌ని ద‌ర్శ‌కుడి స‌న్నిహిత వర్గాల నుంచి లీకైంది. ఆ రోజు బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా విష‌యం అధికారికంగా చెబుతార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య హీరోగా 109వ సినిమాని బాబి తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఎన్నిక‌ల కార‌ణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన‌లేదు. జూన్ 4 ఫ‌లితాలు తర్వాత బాల‌య్య తిరిగి సెట్స్ కి వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకుంటున్నారు.