Begin typing your search above and press return to search.

న‌టసింహ గోల్డెన్ జూబ్లీ వేడుక‌ల్లో మెగాస్టార్!

దీనికి సంబంధించి ఇండ‌స్ట్రీలో ఉన్న అన్నీ సంఘాలు ఒకేతాటిపైకి వ‌చ్చి ఐక్యంగా ముందుకెళ్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Aug 2024 6:13 AM GMT
న‌టసింహ గోల్డెన్ జూబ్లీ వేడుక‌ల్లో మెగాస్టార్!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 పూర్త‌యిన సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ త‌రుపున సెప్టెంబ‌ర్ 1న భారీ ఎత్తున గోల్డెన్ జూబ్లీ సెల‌బ్రేష‌న్లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌వ‌ర‌కూ ఏ న‌టుడి పేరిట ఇంత గ్రాండ్ గా వేడుక‌లు జ‌ర‌గ‌లేదు. తొలిసారి న‌ట‌సింహం పేరిట భారీ ఎత్తున దిక్కులు పిక్క‌టిల్లేలా వేడుక‌లు నిర్వ‌హి స్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి.

దీనికి సంబంధించి ఇండ‌స్ట్రీలో ఉన్న అన్నీ సంఘాలు ఒకేతాటిపైకి వ‌చ్చి ఐక్యంగా ముందుకెళ్తున్నాయి. ఈవెంట్ కి ఇంకా ప‌దిరోజుల స‌మ‌యం ఉంది. దీనిలో భాగంగా ఆహ్వాన ప‌త్రిక‌లు పంపిణీ కార్య‌క్ర‌మం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి ఆహ్వాన ప‌త్రిక అందింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు చిరంజీవిని కలిసి ఆహ్వానం పలికారు.

భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కెఎల్ నారాయణ, మాదాల రవి, అనుపమ్ రెడ్డి, నిర్మాత సి కళ్యాణ్, దర్శకుడు వీర్ శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. అంద‌రూ క‌లిసి చిరంజీవితో ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇండ‌స్ట్రీలో సంఘాల‌న్నీ ఇలా క‌ల‌వ‌డం అన్న‌ది చాలా రేర్.

బాల‌య్య కార‌ణంగా ఆ స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇండ‌స్ట్రీ పెద్ద‌గా చిరంజీవిని అన్ని సంఘాలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చిరును స్వ‌యంగా క‌లిసి ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించి ముందుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఇండ‌స్ట్రీలో మోహ‌న్ బాబు, ముర‌ళీ మోహ‌న్ లాంటి పెద్ద‌లున్నారు. వాళ్ల‌ను కూడా స్వ‌యంగా క‌లిసే అవ‌కాశం ఉంది.