ఆవేశం కోసం బాలయ్యని కాకాపడుతున్నారా..?
జితు మాధవన్ డైరెక్షన్ లో ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్ లో నటించిన ఆవేశం సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.
By: Tupaki Desk | 5 Aug 2024 9:40 AM GMTభారీ బడ్జెట్ సినిమాలన్నీ ఒకేసారి పాన్ ఇండియా రిలీజ్ అంటూ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాక డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఐతే కొన్ని ప్రత్యేకమైన సినిమాలు మాత్రం రీమేక్ చేస్తున్నారు. OTTలు వచ్చాక రీమేక్ సినిమాలకు ఆదరణ తగ్గినా కూడా కొన్ని సినిమాలు రీమేక్ చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు.. ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమాను అందించవచ్చు అని అలా చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళం నుంచి ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అయిన ఆవేశం సినిమా కూడా రీమేక్ చర్చలు జరుగుతున్నాయి.
జితు మాధవన్ డైరెక్షన్ లో ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్ లో నటించిన ఆవేశం సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఆ సినిమా థియేటర్ లో సందడి చేసిన రోజుల్లో ఎన్నో రకాల మీమ్స్ వచ్చాయి. సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్ లో ఎక్కిందో వాటిని బట్టి చెప్పొచ్చు. ఐతే ఆవేశం థియేటర్ లో బ్లాక్ బస్టర్ కాగా ఆ సినిమా ఓటీటీలో కూడా ఆదరించారు. ఐతే ఆవేశం సినిమా చూసిన తెలుగు మేకర్స్ ఇది తెలుగులో డబ్ చేయడం కన్నా రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ ఆవేశం రీమేక్ ప్రయత్నాలు చేస్తుంది. ఐతే డైరెక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు కానీ ఆవేశం సినిమాలో బాలకృష్ణని నటింప చేయాలని చూస్తున్నారు. బాలయ్య ఇమేజ్ కి ఆవేశం పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు. ఆవేశం సినిమా లో ఫాహద్ ఫాజిల్ రోల్ అదరగొట్టేసింది. ఆ పాత్రను తెలుగులో బాలకృష్ణ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్న మైత్రి నిర్మాతలు బాలయ్యను కాకా పడుతున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ ఓకే అంటే చాలు వెంటనే పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి చేయడమే ఆలస్యం అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. బాలకృష్ణ ఆవేశం చేస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకుడు కూడా సినిమాను సూపర్ గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఇంతకీ ఆవేశం రీమేక్ పై బాలకృష్ణ ఒపీనియన్ ఏంటి ఒకవేళ బాలయ్య కాదంటే మరో హీరోతో ఆ సినిమా చేస్తారా లేదా అన్న విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.