Begin typing your search above and press return to search.

బాలయ్య కాంట్రవర్సీ క్లిప్పింగ్స్.. ఓ క్లారిటీ ఇచ్చేసిన GOG టీమ్

ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే ఆ మాత్రం క్లోజ్ నెస్ ఉంటుంది. బాలయ్య గారు అంజలి ముందే మంచి మిత్రులు. ఆ సౌండ్ లో ఆమెను పక్కకు జరగమని చెబితే వినిపించలేదు.

By:  Tupaki Desk   |   30 May 2024 7:27 AM GMT
బాలయ్య కాంట్రవర్సీ క్లిప్పింగ్స్.. ఓ క్లారిటీ ఇచ్చేసిన GOG టీమ్
X

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ నటించిన తాజా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి” విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది, దానికి ముఖ్య అతిథిగా నంద‌మూరి బాల‌కృష్ణ హాజరయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు కలిపిన బాటిల్ ఉన్నట్లు వచ్చిన వీడియో పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే బాలకృష్ణ హీరోయిన్ అంజలిని స్టేజి మీద తోసినట్లు చూపించిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ రెండు విషయాలను పొలిటికల్ గా కూడా టార్గెట్ చేశారు. ఇక ఈ వీడియోలు కొన్ని మీడియా చానెల్స్ ద్వారా చెక్ చేయకుండా ప్రచారం కావడం వల్ల పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాదాలకు స్వయంగా విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఆ రకంగా వచ్చిన వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.

బాలకృష్ణ కాళ్ల దగ్గర ఉన్న మందు బాటిల్ కేవలం సిజీలో ఎడిట్ చేసినదని, అక్కడ ప్రత్యక్షంగా ఉంది మేమే మాకు తెలుసు అని ఆ విషయాన్ని ఖండించారు. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ స్పందిస్తూ అక్కడ ఎలాంటి బాటిల్స్ లేవని అన్నారు. అలాగే, బాలకృష్ణ అంజలిని పక్కకు జరిపిన విధానం సరికాగా అర్థం చేసుకోకుండా, వీడియోలో కేవలం కొన్ని సెకన్లు మాత్రమే చూపించడం వల్ల అపార్థం ఏర్పడిందని వారు వివరించారు.

ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటే ఆ మాత్రం క్లోజ్ నెస్ ఉంటుంది. బాలయ్య గారు అంజలి ముందే మంచి మిత్రులు. ఆ సౌండ్ లో ఆమెను పక్కకు జరగమని చెబితే వినిపించలేదు. కాబట్టి చాలా సరదాగా బాలయ్య అంజలి గారిని అలా పక్కకు నెట్టారు. ఆ తరువాత మళ్ళీ వారిద్దరూ హై ఫై ఇచ్చుకున్నారు. దాన్ని అసలు హైలెట్ చేయలేదు.. అని వారు తెలియజేశారు.

ఇక ఈ వివాదాలపై స్పష్టత రావడంతో, "గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి" సినిమా పై ఉన్న దృష్టి మళ్లీ బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమాను కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసారు, మరియు నేహా శెట్టి, అంజలి ముఖ్య పాత్రల్లో నటించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. సెన్సార్ గురించి కూడా విశ్వక్ సేన్ ఒక క్లారిటీ ఇచ్చారు.

కేవలం మూడు చోట్ల మాత్రమే అభ్యంతరకర పదాలు ఉన్నాయని, అవి కూడా డొమెస్టిక్ కాపీలో ఇబ్బందిగా ఉండవని చెప్పారు. ముందుగా యూత్ మాత్రమే లక్ష్యం అనుకున్నా, ఫైనల్ కాపీ చూశాక చిన్న పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుందని విశ్వక్ సేన్ చెప్పారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.