వరలక్ష్మి పెళ్లి రిసెప్షన్ లో నటసింహం సందడి!
అందరూ నవదంపతులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. పెళ్లి కూతురు పింక్ కలర్ డిజైన్ ధరించారు. మెడలో తెలుపు పొడి డిజైన్ తో కూడిన హారం, మ్యాచింగ్ చెవులీలు ధరించి ఎంతో అందంగా వరలక్ష్మి ముస్తాబైంది.
By: Tupaki Desk | 4 July 2024 5:58 AM GMTశరత్ కుమార్ కుమార్తె- నటి వరలక్ష్మి -నికొలాయ్ సచ్దేవ్ వివాహం మంగళవారం థాయ్ లాండ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే అతిధులందరి కోసం చెన్నైలో భారీ రిసెప్షెన్ ఏర్పాటు చేసారు. ఈ రిసెప్షన్ కి సెలబ్రిటీలంతా హాజరయ్యారు. సీఎం స్టాలిన్ సహా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు.
టాలీవుడ్ నటుడు బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ కి హాజరయ్యారు. ఇంకా సీనియర్ నటులు శివకుమార్ , విజయ్ కుమార్, అతని కూమార్తె నటి శ్రీదేవి, నటుడు సిద్ధార్థ్, గోపీ చంద్ మలినేని వెళ్లారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, కిచ్చా సుదీప్ నటి, మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి తదితరులు సందడి చేసారు.
అందరూ నవదంపతులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. పెళ్లి కూతురు పింక్ కలర్ డిజైన్ ధరించారు. మెడలో తెలుపు పొడి డిజైన్ తో కూడిన హారం, మ్యాచింగ్ చెవులీలు ధరించి ఎంతో అందంగా వరలక్ష్మి ముస్తాబైంది. ఇక నికోలాయ్ కూడా తనదైన శెలిలో అలరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోల నుంచి అందరికీ వరలక్ష్మి స్వయంగా వెడ్డింగ్ కార్డులు అందించి, తప్పక రావాలని ఆహ్వనించింది.
అలాగే శతర్ కుమార్, రాధిక కి ఇక్కడ నటీనటులతో మంచి సత్ససంబంధాలున్నాయి. వరలక్ష్మి కూడా కొంత కాలంగా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. దీంతో పరిశ్రమతో ఆమెకి మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో తెలుగు పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరవుతారనుకున్నారు. కానీ స్టార్ హీరోల్లో బాలయ్య మాత్రమే హైలైట్ అవుతున్నారు.