బాలయ్య-బాబి తగ్గేదేలే! 2024 లో చూసుకుందాం
బాలయ్య సహా ఇతర తారాగణంపై చిత్రీకరించే ఈ ఫైట్ సీన్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని..ఇందులో నటసింహం ఓ సరికొత్త గెటప్ లో కనిపిస్తారని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది.
By: Tupaki Desk | 4 Dec 2023 11:30 PM GMTనటసింహ బాలకృష్ణ-బాబి కాంబినేషన్ లో భారీ యాక్షన్ కం ఎమోషనల్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అంచనాలు పీక్స్ కి చేరాయి. బాలయ్య మాస్ ఇమేజ్ కి..బాబి మాస్ కంటెంట్ తోడైతే! ఏ రేంజ్ లో ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదంటూ అభిమానులు అంతకంతకు అంచ నాలు పెంచేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ మాస్ కాంబినేషన్ కోసం భారీగా ఓ ప్రత్యేక సెట్ నే సిద్దం చేస్తున్నారుట.
ఓస్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ సెట్ వేస్తున్నారుట. ఈ సెట్ నిర్మాణం చాలా ప్రత్యేకంగా జరుగుతుందిట. అందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారుట. ఇప్పటివరకూ ఇలాంటి సెట్ నిర్మాణం ఏ సినిమాకి జరగలేదని..సెట్ పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచేలా ఉంటుంది. అలాగే యాక్షన్ సన్నివేశం అంతకు మించి థ్రిల్ ని పంచేలా ఉంటుందని అంటున్నారు.
బాలయ్య సహా ఇతర తారాగణంపై చిత్రీకరించే ఈ ఫైట్ సీన్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని..ఇందులో నటసింహం ఓ సరికొత్త గెటప్ లో కనిపిస్తారని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. బాలయ్య మార్క్ యాక్షన్ ఏమాత్రం తగ్గకుండా స్టోరీ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. యాక్షన్ స్టోరీలోనే ఫ్యామిలీ ఎమోషన్ కి దర్శకుడు పెద్ద పీట వేసినట్లు సమాచారం. అలాగే పొలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలుంటాయట.
వాటిలో బాలయ్య చెప్పే డైలాగులు థియేటర్లో అభిమానులు విజిల్స్ వేడయం ఖాయమంటున్నారు. వాస్తవానికి బాబి ఈ డైలాగులు మరో స్టార్ హీరోతో చెప్పించాలనుకున్నారుట. కానీ ఆయన కాంట్రవర్శీ స్టార్ కాకపోవడం..మృదు స్వభావం గలవారు కావడంతో వాటి జోలికి మనం వెళ్లోద్దని ఆదేశించడంతో! బాబి ఆగాడని వినిపిస్తుంది. కానీ బాలయ్య మాత్రం ఆయనలా మనం తగ్గం అని..తనదైన శైలి లో అన్నిరకాల డైలాగులు చెప్పడానికి సిద్దంగా ఉన్నట్లు నమ్మకాన్ని ఇచ్చారుట. అలాంటి స్టార్ దొరికితే బాబి కూడా చెలరేగిపోతాడు అనడంలో సందేహం లేదు.