విశ్వక్ సేన్ నాకు అన్నయ్య.. మోక్షజ్ఞ వస్తున్నాడు: బాలకృష్ణ
ముఖ్యంగా హీరో విశ్వక్ సేన్ తో తనకున్న అనుబంధం గురించి ఆయన చాలా చక్కగా వివరణ వివరించారు.
By: Tupaki Desk | 28 May 2024 5:22 PM GMTవిశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఈవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వేడుకలో ఆయన మాట్లాడిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా హీరో విశ్వక్ సేన్ తో తనకున్న అనుబంధం గురించి ఆయన చాలా చక్కగా వివరణ వివరించారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. ముందుగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. నాన్నగారు నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా ఈ వేడుకకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చిన జన్మ వల్లనే ఈ రోజు మీ అందరి ముందు నేను ఉన్నాను. ఆయన నాకు దైవ సమానం. ఇక ఈ వేడుకకు వచ్చిన అభిమానులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను నిర్మించిన నిర్మాత నాగ వంశీ గారికి అలాగే సాయి సౌజన్య గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సినిమా వారికి మంచి విజయాన్ని అందించాలి అని కోరుకుంటున్నాను. ఇక ఇందులో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినప్పటికీ కూడా నాకు సోదరుడు లాంటి. వాడు ఒక విధంగా ఆయనకు నేను తమ్ముడిని అంటూ నవ్వుతూ మాట్లాడారు.
దాదాపు ఇద్దరి భావాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒక విధంగా నాకు అతను అన్నయ్య లాంటి వాడు. మొదటి నుంచి కూడా అతని జర్నీ చూస్తున్నాను. చాలా మంచి నటుడు. ఎప్పుడు కొత్తగా కనిపించడానికి నేను ప్రయత్నిస్తాను. సినిమా సినిమాకు తేడా ఉండాలి. ఆ ఉడుకు రక్తం విశ్వక్సేన్ లో కనిపించింది. ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ తోనే చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. సినిమాలో గోదావరి అందాలతో పాటు చాలా ఎమోషన్ ఉన్నట్లు అనిపిస్తుంది.
మంచి కిక్కు ఇచ్చేలా ఉందనిపిస్తోంది. కొత్తగా ట్రై చేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అదే తరహాలో ఈ సినిమా చేశారు అనిపిస్తుంది. ఇక దర్శకుడు కృష్ణ చైతన్య మేకింగ్ చాలా గొప్పగా ఉంది. ఇంతకుముందు అతను నారా రోహిత్ తో రౌడీ ఫెలో చేశారు. చాలా మంచి సినిమాలు చేశాడు. ఈ సినిమాను కూడా తప్పకుండా ఆదరిస్తారు హిట్ అవుతుంది అనుకుంటున్నాను..నేహా శెట్టి కత్తి. అంజలి ఖతర్నాక్.. ఇద్దరూ చాలా అందమైన హీరోయిన్స్. అంజలితో నేను డిక్టేటర్ అనే సినిమా చేశాను. ఆమె భావాలు కూడా నాకు దగ్గరగా ఉంటాయి. ఇద్దరికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి.
నెక్స్ట్ ఇక ఈ సినిమా విజయోత్సవ సభలో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఈ తరం వారిని చాలామంది స్ఫూర్తిగా తీసుకోవాలి. రేపు మా వాడు కూడా ఇండస్ట్రీకి రావాలి. మోక్షజ్ఞ కూడా మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. నన్ను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకోవద్దు అనే చెబుతాను. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అలా ప్రేక్షకులకు తగ్గట్టుగా మనం ఉండాలి. అడివి శేషు సిద్దు జొన్నలగడ్డ లాంటివాళ్లేనే స్ఫూర్తిగా తీసుకోవాలి అని మా మోక్షజ్ఞ చెబుతూ ఉంటాను.
అలాగే ఎప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించాలి. ఇక ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక స్పెషల్ కాంబో గురించి త్వరలోనే చెప్పబోతున్నాము అని నందమూరి బాలకృష్ణ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు.