Begin typing your search above and press return to search.

అఖండ సెంటిమెంట్ తో NBK 109..?

ఈ సినిమా కూడా బాలయ్య మార్క్ మాస్ అంశాలతో ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ అందించేలా ఉంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 1:23 PM GMT
అఖండ సెంటిమెంట్ తో NBK 109..?
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నారు. అఖండతో రికార్డులు సృష్టించిన బాలయ్య ఆ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో కూడా అదరగొట్టారు. సీనియర్ హీరోల్లో ఒక రేంజ్ లో దూకుడు చూపిస్తున్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా అదే రేంజ్ ప్లానింగ్ లో వస్తున్నారు. NBK 109 సినిమాను కె.ఎస్ బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాలయ్య మార్క్ మాస్ అంశాలతో ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ అందించేలా ఉంటుందని అంటున్నారు.

అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ గా కూడా వీర మాస్ అని పెట్టబోతున్నారని టాక్. వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ బాలయ్యతో కూడా మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా కోసం అఖండ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్టు టాక్. అదెలా అంటే అఖండ సినిమా డిసెంబర్ లో రిలీజై సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా సెంటిమెంట్ తోనే NBK 109వ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

డిసెంబర్ లో సినిమా రిలీజ్ అంటే దాదాపు సూపర్ హిట్ అన్నట్టే లెక్క. అందులోనూ బాలయ్య సినిమాలు మాక్సిమం సక్సెస్ లు సాధించాయి. డిసెంబర్ లో క్రిస్మస్ రేసులో ఆల్రెడీ సినిమాలు రిలీజ్ లాక్ చేసుకోగా మొదటి రెండు వారాల్లో బాలకృష్ణ సినిమా రిలీజ్ ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్.బి.కె 109 ని పూర్తి చేసి 110 వ సినిమా అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు బాలయ్య.

అఖండ 2 సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి కాగా కాస్టింగ్ ఫైనల్ చేసే పనుల్లో ఉన్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. బోయపాటి శ్రీను బాలయ్య ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లతో అదరగొట్టగా అఖండ 2 తో డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధం అవుతున్నారు. అఖండ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేయగా అఖండ 2 సినిమాను మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నరని తెలుస్తుంది. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో చూపించేందుకు రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.