Begin typing your search above and press return to search.

వామ్మో.. దేవరకు బాలయ్య గండం..?

నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో చాలా కాలంగా గ్యాప్ ఉంది అని అందరికీ తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   8 Nov 2023 1:15 PM GMT
వామ్మో.. దేవరకు బాలయ్య గండం..?
X

నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో చాలా కాలంగా గ్యాప్ ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. ఇక రీసెంట్గా చంద్రబాబు అరెస్టుపై కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం కూడా నందమూరి కుటుంబంలో కొంత హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఆ విషయంపై ఇన్ డైరెక్ట్ గా బాలయ్య బాబు ఐ డోంట్ కేర్ అన్నట్లుగానే స్పందించడం రాజకీయాల్లోనే కాకుండా నందమూరి ఫ్యాన్స్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.

ఆ సంగతి పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు కూడా పోటీ పడకూడదు అని కోరుకుంటారు. ఒకవేళ వీరిద్దరి మధ్యలో పోటీ పెడితే కనుక ఆ వాతావరణం మామూలుగా ఉండదు. ఒక విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి పోటీని ఎంత మాత్రం కోరుకోడు అని అందరికీ తెలుసు. ఇక బాలకృష్ణ సైతం అలా కోరుకోకపోవచ్చు.

ఇక పరిస్థితి మాత్రం అలా వచ్చింది అంటే.. దర్శక నిర్మాతలు బలంగా ఫిక్స్ అయితే ఈ హీరోలు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలకృష్ణ నెక్స్ట్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో కల్యాణ్ రామ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. అయితే ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు అదే సమయంలో నందమూరి బాలకృష్ణ 109వ సినిమా కూడా థియేటర్లలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అయితే ప్రస్తుతం అనుకుంటున్న ప్లాన్ ప్రకారం అయితే 2024 మార్చి 29 బెస్ట్ డేట్ అనుకుంటున్నట్లు టాక్. అంటే దేవర కంటే ఒక వారం ముందుగానే థియేటర్లలో ఉంటుంది. మిగతా హీరోల సినిమాలు అంటే ఏమైనా అనుకోవచ్చు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరు హీరోల పెద్ద సినిమాలు వారం గ్యాప్ లో రావడం అంటే కచ్చితంగా మంచి పోటీ అయితే కాదు. అందులోనూ నందమూరి బాబాయ్ అబ్బాయ్ పోటీ అంటే థియేటర్ల వద్ద వాతావరణం మాములుగా ఉండదు. మరి ఈ పోటీ విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.