తగ్గేదేలే! రామ్‌పై బాలయ్య అసహనం దేనికి?
అదంతా అటుంచితే నటసింహా నందమూరి బాలకృష్ణకు స్కంద వేదికపై కోపం వచ్చింది. అది కూడా ఇస్మార్ట్ రామ్ పైనే ఆయన కోపగించుకున్నారు.
By: Tupaki Desk | 27 Aug 2023 11:29 AM GMTవేదికలపై నటసింహం చెలరేగే తీరు ఎప్పుడూ సెన్సేషనే. తెలుగు భాష.. తెలుగు సంస్కృతి.. సంస్కృత భాష.. ఇలా అన్నిటికీ ఆయన ప్రాముఖ్యతనిస్తారు. దీనికి తోడు భాష యాస గురించి ప్రతిసారీ వేదికలపై మెజారిటీ సమయం మాటా మంతీ నడిపించేస్తుంటారు. ఈసారి 'స్కంద' ప్రచార వేదికపైనా బాలయ్య తగ్గేదేలే అంటూ చెలరేగిపోయారు.
అదంతా అటుంచితే నటసింహా నందమూరి బాలకృష్ణకు స్కంద వేదికపై కోపం వచ్చింది. అది కూడా ఇస్మార్ట్ రామ్ పైనే ఆయన కోపగించుకున్నారు. కొంత అసహనం వ్యక్తం చేసారు. అయితే దీనికి కారణం శ్రీలీల- సయీ మంజ్రేకర్ లలో ఎవరు బాగా నటించారు? అని యాంకర్ సుమ ఇస్మార్ట్ రామ్ ని ప్రశ్నించగా.. బాలయ్య ఉండగా ఇంకెవరి గురించి మాట్లాడాలి అని రామ్ అన్నారు. అయితే దీనికి బాలయ్య నొచ్చుకున్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టారు. హీరోయిన్ల గురించి మాట్లాడకుండా నన్ను ఎందుకు ఇరికిస్తావు? అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టారు బాలయ్య. అయితే కాసేపటికే కూల్ అయిపోయి రామ్ తో కలిసిపోయారు.
ఇక ఈ వేదికపై రామ్ తో కలిసి అల్లరి చిల్లరి బుల్లోడుగా మారిపోయాడు బాలయ్య. బోలెడంత ఫన్ క్రియేట్ చేసాడు. ఇక తనదైన శైలిలో సంస్కృత శ్లోకాలు చదివేస్తూ అహూతుల్లో చర్చనీయాంశంగా మారాడు.
అయితే వేదికపై అతడు మల్టీ టాస్క్ లను ప్రస్థావిస్తూ అనర్గళంగా మాట్లాడిన తీరు ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఇస్రో యువశాస్త్రవేత్త ఇంటి పేరు సహా అతడి చరిత్ర గురించి మాట్లాడి వ్వావ్ అనిపించాడు. ఇక వేదికపై రామ్ పై నటసింహా చిరు కోపం ప్రదర్శించడం అంతలోనే తిరిగి కలిసిపోవడం ఇవన్నీ డ్రమటిక్ గా కనిపించే వాస్తవాలు.