Begin typing your search above and press return to search.

NBK 109 : జాలి, దయ లేని అసురుడు.. పవర్ఫుల్ బాలయ్య!

ఇక నేడు బాలయ్య బర్త్ డే సందర్భంగా.. NBK 109 మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ ఇస్తామని అనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 7:03 AM GMT
NBK 109 : జాలి, దయ లేని అసురుడు.. పవర్ఫుల్ బాలయ్య!
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా హ్యాట్రిక్ హిట్లు సాధించిన బాలయ్య.. ఇప్పుడు డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో NBK 109 సినిమా చేస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. మళ్లీ సెట్స్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.


ఇక నేడు బాలయ్య బర్త్ డే సందర్భంగా.. NBK 109 మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. చెప్పినట్లే సోమవారం ఉదయం ఈ మూవీ నుంచి మరో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 'దేవుడు చాలా మంచోడు అయ్యా. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది జాలి, కరుణ, దయ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్స్ తో గ్లింప్స్ స్టార్ట్ అయింది.

జాలి, దయ, కరుణ పదాల అర్ధమే తెలియని అసురుడంటూ బాలయ్య రోల్ కు ఎలివేషన్లు ఇచ్చారు NBK 109 మేకర్స్. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అంచనా వేసుకోవచ్చు. ఇక గ్లింప్స్ లో బాలయ్య తన చేతిలో రెండు బ్యాగులతో వేరే లెవల్ లో ఎంట్రీ ఇచ్చారు. చివర్లో బాలయ్య.. శత్రువు తల నరికి, గుర్రంపై అదిరిపోయేలా స్వారీ చేయడం లేటెస్ట్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది.

మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా అని చెబుతున్నారు. బాలయ్య రోల్ కు బాబీ ఇచ్చిన ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. బాలయ్య మాస్ లుక్ అండ్ యాక్షన్ అదిరిపోయిందని, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందని కొనియాడుతున్నారు. సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని నందమూరి ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. బ్యూటీలు చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను ఈసారి కూడా మేకర్స్ ప్రకటించలేదు. మరెప్పుడు ఆ రెండు క్రేజీ అప్డేట్లను మేకర్ ఇస్తారో వేచి చూడాలి.