Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్స్ ఇది నెవ్వర్ బిఫోర్ ట్రీట్

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్స్ తో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాడు.

By:  Tupaki Desk   |   28 July 2024 5:30 PM GMT
బాలయ్య ఫ్యాన్స్ ఇది నెవ్వర్ బిఫోర్ ట్రీట్
X

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్స్ తో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్నారు. వీటితో బాలయ్య మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక బాలయ్యపై భారీ బడ్జెట్ లు పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఒకప్పటి తరహాలో రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమాలు కాకుండా బలమైన కథలతో బాలయ్య మూవీస్ చేస్తున్నారు. అందుకే అతనికి వరుస విజయాలు వస్తున్నాయి.

ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగానే ఈ సినిమా తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లేకుండా జరుగుతోంది. సినిమాలో ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

బాబీ డియోల్ ఈ సినిమాలో బాలయ్యకి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని టాక్. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. అలాగే బాలయ్య క్యారెక్టర్ టీజర్ తప్ప మూవీ నుంచి కొత్తగా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయితే బాలయ్య బాబు అభిమానులు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఉంటాయంట.

బాలయ్య బాబు స్టైల్ మేనరిజమ్స్ తో పెర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తూ ఫైట్స్ ని డిజైన్ చేసారంట. ఇవన్నీ అభిమానులకి గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. బాలకృష్ణ క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఈ చిత్రంలో ఉండబోతోందని టాక్. కచ్చితంగా అభిమానులకి మాత్రం ఈ చిత్రంలో దర్శకుడు బాబీ మాస్ ఫీస్ట్ అందించబోతున్నాడంట.

ఈ మూవీతో బాలయ్యకి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని డైరెక్టర్ బాబీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు. థమన్ తన మ్యూజిక్ తో అఖండ సినిమాలో పవర్ ఫుల్ ఎలివేషన్ మ్యూజిక్ తో బాలకృష్ణ క్యారెక్టర్ ని అమాంతం లేపి టాప్ లో నిలబెట్టారు. ఈ సినిమా మ్యూజిక్ తో థమన్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేశారు. బాబీ సినిమా కోసం అంతకంటే బెస్ట్ మ్యూజిక్ ని థమన్ ఇవ్వబోతున్నారంట. కచ్చితంగా బాలయ్య అభిమానులు కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఈ మూవీ ఉంటుందనే మాట వినిపిస్తోంది. డిసెంబర్ లేదా 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.