Begin typing your search above and press return to search.

బాబాయ్ ఇది కరెక్ట్‌ కాదు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌

అక్టోబర్‌ 10న సినిమాను విడుదల చేయాలని టార్గెట్‌ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 May 2024 5:48 AM GMT
బాబాయ్ ఇది కరెక్ట్‌ కాదు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌
X

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా కొన్ని కారణాల వల్ల లేట్‌ అయ్యింది. మొదట అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోయారు. అక్టోబర్‌ 10న సినిమాను విడుదల చేయాలని టార్గెట్‌ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. కనుక ఖచ్చితంగా సినిమాను వచ్చే అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. అక్టోబర్ విడుదల అనేది అందరి కంటే ముందే దేవర ఫిక్స్ అయ్యింది. కనుక ఇతర సినిమాలకు ఛాన్స్ ఇవ్వద్దని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా కూడా అక్టోబర్‌ లోనే విడుదల అవ్వబోతుంది అని . రెండు నెలలు షూటింగ్స్ కు దూరంగా ఉన్న బాలయ్య తాజాగా జాయిన్‌ అయ్యాడు.

జులై వరకు షూటింగ్‌ ను ముగించి అక్టోబర్ లో సినిమాను విడుదలకు రెడీ చేయాలని దర్శకుడు బాబీ కి బాలయ్య టార్గెట్‌ పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ దేవర సినిమా వస్తున్న సమయంలోనే బాలయ్య 109 రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపిస్తుంది.

బాలయ్య 109 ని అక్టోబర్‌ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం గట్టిగా నడుస్తుంది. దాంతో ఎన్టీఆర్‌ దేవర కి పోటీగా బాబాయి సినిమా వస్తుందని, దాంతో అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ కానుంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏ రెండు పెద్ద సినిమాలు ఒకే వారంలో వచ్చేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించరు. కేవలం నిర్మాతలు మాత్రమే కాకుండా బయ్యర్లు మరియు ఎగ్జిబ్యూటర్స్ కి కూడా ఇబ్బందే. అందుకే కనీసం వారం రోజుల గ్యాప్‌ తో అయినా ఈ రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

కానీ బాబాయి, అబ్బాయి సినిమాలు కేవలం వారం గ్యాప్ తో వస్తే సరిపోదు.. కనీసం రెండు లేదా మూడు వారాల గ్యాప్ ఉండాలి అనేది ఫ్యాన్స్ మాట. అందుకే బాలయ్య కు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కరెక్ట్‌ కాదు, పోటీ వద్దని, దేవర పాన్‌ ఇండియా మూవీ కనుక మీ సినిమానే మార్చుకోండి బాబాయి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో అప్పుడే పోస్ట్‌ లు పెట్టడం మొదలు పెట్టారు.