Begin typing your search above and press return to search.

పవన్- బాలయ్య ఇండ‌స్ట్రీకి కుడి ఎడమలా

నేడు సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌మాణం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 4:58 AM GMT
పవన్- బాలయ్య ఇండ‌స్ట్రీకి కుడి ఎడమలా
X

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూట‌మిలో అద్భుత విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. బాలయ్య గత మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. పవన్ ఈసారి జ‌న‌సేనానిగా అసాధార‌ణ విజ‌యం సాధించారు. పోటీ చేసిన అన్ని సీట్ల‌ను గెలిపించుకున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉప ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టి కీల‌క బాధ్య‌త‌ల‌ను చేప‌డ‌తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. నేడు సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌మాణం చేస్తున్నారు.

ఇద్ద‌రు సినీదిగ్గ‌జాలు, టాలీవుడ్ మూల స్థంబాలు ఏపీ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉండ‌టం అన్న‌ది ప‌రిశ్ర‌మ‌కు అన్ని విధాలా క‌లిసొచ్చే సంకేతం అని ఇండ‌స్ట్రీ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌కు ఏ స‌మ‌స్య ఉన్నా ప‌రిష్క‌రించేందుకు ఆ ఇరువురూ స‌హ‌క‌రిస్తార‌ని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చేసిన ఓ వ్యాఖ్య తెలుగు చిత్ర‌సీమ‌లో హాట్ టాపిక్ గా మారింది.

``మా టాలీవుడ్ తరపు నుంచి పవన్, బాలయ్య లాంటి వారు కుడి, ఎడమలా ఇప్పుడు రూలింగ్ ప్రభుత్వంలో ఉన్నారు అని.. ఇక ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదు అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. దీని అర్థం గ‌త ప్ర‌భుత్వం టికెట్ రేట్లు స‌హా చాలా విష‌యాల్లో అణ‌చివేత ధోర‌ణిని అనుస‌రించింది. ఇప్పుడు అలా కాకుండా ఇండ‌స్ట్రీ నిర్ణ‌యాల‌కు అనుకూలంగా ఏపీ ప్ర‌భుత్వంతో మాట్లాడేందుకు ప‌వ‌న్, బాల‌య్య ఉన్నారనే ధీమా క‌నిపిస్తోంది. అలాగే తెలుగు చిత్ర‌సీమ కేవ‌లం తెలంగాణ‌-హైద‌రాబాద్ వ‌ర‌కే ప‌రిమితం కాద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖ‌ప‌ట్నంలో కొత్త ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ప‌వ‌న్, బాల‌య్య‌ స‌హ‌క‌రిస్తార‌ని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకోవ‌డం మ‌ళ్లీ వినిపిస్తోంది.