Begin typing your search above and press return to search.

బాల‌య్య బిజీబిజీ..మ‌రి ప‌వ‌న్ జీ కారా?

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత న‌ట‌సింహ బాల‌కృష్ణ య‌ధావిధిగా షూటింగ్ లో బిజీ అయ్యారు.

By:  Tupaki Desk   |   8 July 2024 7:30 AM GMT
బాల‌య్య బిజీబిజీ..మ‌రి ప‌వ‌న్ జీ కారా?
X

ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత న‌ట‌సింహ బాల‌కృష్ణ య‌ధావిధిగా షూటింగ్ లో బిజీ అయ్యారు. బాబి ద‌ర్శ‌క త్వంలో న‌టిస్తోన్న 109వ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాబి పిల‌వ‌డానికంటే ముందుగానే బాల‌య్య రెడీ అంటూ హింట్ ఇవ్వ‌డంతో బాబి రంగంలోకి దిగేసారు. బాల‌య్య ఎంట‌ర్ అయిన త‌ర్వాత ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసేసారు. దీనీలో భాగంగా బాల‌య్య‌, ఇత‌ర తారాగాణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మరో కొత్త షెడ్యూల్ ఈనెల మూడోవారం నుంచి మొద‌లువుతంది.

ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగుతుంది. ఇందులో బాల‌య్య పై యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. అలాగే ఇత‌ర న‌టీన‌టుల‌పై కొన్ని సెంటిమెంట్ స‌న్నివేశాలు కూడా షూట్ చేస్తార‌ని తెలిసింది. ఈ సినిమా త‌ర్వాత బోయపాటితో మ‌రో సినిమా చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. ఇలా బాల‌య్య ఫ‌లితాల మోడ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి సినిమాల‌కు బాండ్ అయిపోయారు.

మ‌రి ప‌వన్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి ఏంటి? అంటే ఆయ‌న ఇంకా గెలుపు ఉత్సాహం నుంచి బ‌య‌ట ప‌డిన‌ట్లు క‌నిపించ‌లేదు. డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో ఆ ప‌నుల్లోనే బిజీ అయ్యారు. ప‌రిపాల‌నకు సంబంధించి అధికారుల‌తో భేటీ అవ్వ‌డం..పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడ‌టం వంటివి ఇంకా కొన‌సాగు తున్నాయి. దీంతో ఆయ‌న పూర్తి చేయాల్సిన షూటింగ్ లో మ‌రింత జాప్యం త‌ప్పేలా లేదు.

ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న ఎప్ప‌టి నుంచి షూటింగ్ వ‌స్తారు? అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ఓవైపు `ఓజీ` కోసం సుజిత్ వెయిట్ చేస్తున్నాడు. మ‌రోవైపు `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` కోసం ఏఏం ర‌త్నం అండ్ కో ఎదురు చూస్తోంది. ఇంకోవైపు భగ‌త్ సింగ్ కోసం హ‌రీష్ శంక‌ర్ ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఈ మూడు సినిమాలు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది. ప‌వ‌న్ రాక కోసం ఆముగ్గురు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు.