Begin typing your search above and press return to search.

మోక్ష‌జ్ఞ ఎంట్రీ...ఆ రెండు తేదీలు కీల‌కం!

నంద‌మూరి వార‌సుడు, న‌ట‌సింహ బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Aug 2024 6:31 AM GMT
మోక్ష‌జ్ఞ ఎంట్రీ...ఆ రెండు తేదీలు కీల‌కం!
X

నంద‌మూరి వార‌సుడు, న‌ట‌సింహ బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా విష‌యాన్ని రివీల్ చేసాడు. అయితే నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఇంకా విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. దీంతో ఇప్పుడు ఆస‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లు క‌నిపిస్తుంది. అందుకు రెండు తేదీల్ని నందమూరి ఫ్యామిలీ బ్లాక్ చేసి పెట్టిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే..

బాల‌కృష్ణ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ భారీ ఎత్తున స్వ‌ర్ణోత్స‌వాలు నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 1న ఈ కార్య‌క్ర‌మంగా గ్రాండ్ గా జ‌రుగుతుంది. బాల‌య్య ఇండ‌స్ట్రీలో సాధించిన విజ‌యాలు, అవార్డులు..రివార్డులు, 50 ఏళ్ల సినీ ప్ర‌యాణం, రాజ‌కీయంగా సాధించిన విష‌యాల‌పై ప్ర‌త్యేకంగా వ‌క్త‌లంతా మాట్లాడే అవ‌కాశం ఉంది. ఆ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి కుటుంబ స‌భ్యులంతా కూడా హాజ‌ర‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ రోజున మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆ కుటుంబ స‌భ్యులు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందంటున్నారు. ఆ రోజున క‌చ్చితంగా బాల‌య్య త‌న‌యుడి గురించిమాట్లాడే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఆ వేదికపై రివీల్ చేయ‌క‌పోతే మ‌రో తేదీ క‌నిపిస్తుంది. అదే సెప్టెంబ‌ర్ 6. ఆ తేదీకో ప్ర‌త్యేక ఉంది. నంద‌మూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ జ‌న్మించింది అదే రోజు. కాబ‌ట్టి భారీ ఎత్తున పుట్టిన రోజు వేడుక‌లు ఎలాగూ సెల‌బ్రేట్ చేస్తారు.

ఈ నేప‌థ్యంలో ఆ తేదీనైనా ఎంట్రీ గురించి అభిమ‌నుల‌తో ఫ్యామిలీ పంచుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక డేట్లో మోక్ష‌జ్ఞ పేరు మారుమ్రోగ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని బాల‌కృష్ణ చిన్న కుమార్తె తేజ‌స్విని నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం.