Begin typing your search above and press return to search.

బాలయ్యతో అంటే ఇట్లుంటది మరి

ఇక నందమూరి నటసింహం బాలయ్య హిందూపూర్ లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసం బాలకృష్ణ క్యూ లైన్ లో నిలబడ్డారు.

By:  Tupaki Desk   |   14 May 2024 4:02 AM GMT
బాలయ్యతో అంటే ఇట్లుంటది మరి
X

ఏపీలో ఎన్నికల ఓటింగ్ మేగ్జిమమ్ పూర్తయ్యింది. ఎంత పోలింగ్ జరిగింది అనేది అధికారికంగా ఇంకా బయటకి రాలేదు. అయితే గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే అలానే అనిపించింది. అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాలలో ఉండి ఓటు వినియోగించుకొని వెళ్లారు.

అయితే ఈ పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో అప్పుడే క్లారిటీగా ఎవరూ చెప్పలేరు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు క్యూ పాటించకుండా వెళ్లి పబ్లిక్ తో చివాట్లు తిన్నారు.

పోలింగ్ జరుగుతున్న 100 మీటర్ల పరిధిలో ప్రజలని ఇన్ ఫ్ల్యూయెన్స్ చేసే విధంగా ఏ విధంగా పార్టీ జెండాలు గాని, సింబల్స్ గా ఉండకూడదు. అలాగే పార్టీలు చేసే కార్యక్రమాలకి సంబందించిన లోగోలు కనిపించకూడదు. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు అందరికి ఉంటుంది. పిఠాపురంలో ఓ జనసేన కార్యకర్త మేడలో ఎర్రకండువా వేసుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు.

దానిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎర్ర కండువా జనసేన పార్టీకి ప్రతీక అని ఆమె భావించారు. తెలంగాణాలో ఓట్లు వేసిన జూనియర్ ఎన్టీఆర్ బ్లూ కలర్ షర్ట్ వేసుకోవడం పరోక్షంగా వైసీపీకి ఓటు వేయమన్నాడు అంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేశారు.

ఇక నందమూరి నటసింహం బాలయ్య హిందూపూర్ లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసం బాలకృష్ణ క్యూ లైన్ లో నిలబడ్డారు. అయితే పసుపు కండువా మెడలో వేసుకొని బాలకృష్ణ ఓటు వేయడానికి వెళ్లడం విశేషం. అయిన కూడా బాలయ్యకి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే ప్రయత్నం చేయలేదు.

ఈ వీడియోని బాలయ్య బాబు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాలయ్య బాబుని ఎవరైనా అడిగితే రియాక్షన్ ఎలా ఉంటుందో పబ్లిక్ కి తెలుసుకాబట్టి ఎవరూ ధైర్యం చేయలేదని ఆ వీడియో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓటు వేసే సమయంలో మాత్రం బాలయ్య ఎలాంటి కండువా వేసుకోలేదు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది.